HDFC బ్యాంక్ సూపర్ పొటెన్షియల్ ఉందట..

HDFC బ్యాంక్ స్టాక్ ఇప్పుడున్న రేటు నుంచి మరో 50శాతం పెరిగే అవకాశం ఉందంటూ మోర్గాన్ స్టాన్లే రీసెర్చ్ రిపోర్ట్ ఇవ్వడం సంచలనం కలిగిస్తోంది. ఈ బ్యాంక్‌కి సంబంధించిన హోమ్ లోన్ సెగ్మెంట్ డబుల్ డిజిట్ గ్రోత్ సాధించనుందనేది

ఆ రిపోర్ట్ సారాంశం. 


డిసెంబర్ క్వా


ర్టర్ రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ బ్యాంక్ స్టాక్ 15శాతం పతనం అయింది.  మార్జిన్ల విషయంలో గత పదేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా

తగ్గిపోయింది. ఇదే సమయంలో ఋణాల మంజూరు విషయంలోమొత్తం మార్కెట్‌లో 18-20శాతం HDFC బ్యాంక్ సాధించినట్లు తెలుస్తోంది. ఇతర బ్యాంకులతో

పోల్చినప్పుడు ఇంటి ఋణాల మంజూరులో 3.6శాతం  వృద్ధి నమోదు చేసింది. ఇదిగో ఈ విషయాన్నింటిని లెక్కగట్టి..మోర్గాన్ స్టాన్లే బ్యాంక్ స్టాక్‌

టార్గెట్ ప్రైస్  నిన్నటి క్లోజింగ్ రేటు రూ.1424 కాగా..ఆ రేటు రూ. 2110 వరకూ చేరే ఛాన్స్ ఉందని మోర్గాన్ స్టాన్లే చెప్తోంది

Comments