హిందాల్కోలో భారీగా అమ్మకాలు,రీజన్ ఇది i టాటా-కోరస్ డీల్‌లా బే మినిట్టేఅవదుకదా


హిందాల్కో షేరు ఇవాళ భారీగా పతనం అవుతోంది. సబ్సిడరీ నోవెలిస్ మంచిఫలితాలను అందించినా సరే ఇలా జరగడానికి కారణంగా బే మినెట్టే ప్రాజెక్ట్‌ని డౌన్ గ్రేడ్ చేయడమేనంటున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మరో ఏడాది సమయం అలానే 65శాతం కేపిటల్ కాస్ట్ ఎక్కువ కానుందని నోవెలిస్ ప్రకటించింది. దీంతో బే మినెట్టే ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 4.1 బిలియన్ డాలర్లకు చేరనుంది. పూర్తి కావడానికి 2027 దాకా ఎదురు చూడాలి



అట్లాంటా బేస్డ్ కంపెనీ నోవెలిస్ 121 మిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేయగా, ఇది 

గతంతో పోల్చితే పదింతలు పెరిగింది.ఐతే  నికరంగా అమ్మకాలు   6శాతం తగ్గి, 3.9 బిలియన్ డాలర్లకి పరిమితం అయింది

దీనికి అల్యూమినియం ధరలు తగ్గడంతో తగ్గిన అమ్మకాల విలువ కూడా కుంచించుకుపోయాయని తెలుస్తోంది..చూడబోతే..

ఈ బే మినెట్టే ప్రాజెక్ట్ టాటా స్టీల్‌కి అప్పట్లో కోరస్ డీల్‌లా మారినా మారవచ్చు


ఈ నేపథ్యంలోనే హిందాల్కో ఇంట్రాడేలో 15శాతం వరకూనష్టపోయిరూ.496.35కి పతనం అయింది


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి రూ.503దగ్గర ట్రేడ్ అయింది

Comments