కొద్దిలాభం..నష్టాల్లో PSU

 



మార్కెట్లు కొత్తవారాన్ని కొద్దిపాటి లాభంతో ఆరంభించి వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయ్. ఆ తర్వాత తిరిగి పైకి లేచే ప్రయత్నం చేస్తున్నాయ్.నిఫ్టీ ఇంట్రాడేలో 21831 పాయింట్ల వరకూ వెళ్లగా..లోయర్‌లెవల్ 21628 పాయింట్ల వరకూ దిగింది.


సెన్సెక్స్ 71756 పాయింట్ల వరకూ పెరిగి, ఆ తర్వాత 500 పాయింట్ల వరకూ నష్టపోయింది

తిరిగి రికవర్ అయి 71422 పాయింట్ల దగ్గర 173 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది


హెల్త్ కేర్, ఐటీ,టెక్ షేర్లు కాస్త లాభంతో ఉండగా, పిఎస్ఈ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్

సెక్టార్లు మూడు నుంచి ఒకటిన్నరశాతం నష్టపోయాయ్. బ్యాంక్ నిఫ్ట ముప్పావుశాతం

నష్టాలతో ట్రేడవుతోంది


నిఫ్టీప్యాక్‌లో విప్రో, అపోలో హాస్పటల్, హెచ్‌సిఎల్ టెక్, దివీస్,డా.రెడ్డీస్ ల్యాబ్స్ రెండు నుంచి

4శాతం వరకూ లాభపడ్డాయ్. లూజర్లలో హీరోమోటోకార్ప్, బిపిసిఎల్, కోల్ఇండియా, ఎన్టీపిసి,

ఓఎన్‌జిసి మూడు నుంచి ఆరుశాతం వరకూ నష్టపోయాయ్

Comments