సెలెక్టివ్ PSUలలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా


ఈ ప్రశ్న ఇప్పుడు కొందరి మదిలో మెదులుతోంది. ఎందుకంటే, 

NTPC,ONGC,BHEL సహా కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో హయ్యర్ లెవల్స్ నుంచి పదిశాతం కరెక్షన్ కన్పిస్తోంది.



ఆయిల్ రంగ కంపెనీలు BPCL,IOC, బొగ్గు దిగ్గజం కోల్ఇండియాలోనూ ఇదే మాదిరి ట్రెండ్ ఉంది

NHPC,IRCON,IRFC,NBCC,BEL,HUDCO లోనూ డిటో..!


మరి మార్కెట్లు ప్రతి రోజూ పెరుగుతూనే పోవాలంటే కుదరదు..అప్పటికీ 19600 నుంచి దాదాపుగా 22వేల పాయింట్ల వరకూ ఏడాది పరుగు పెట్టిన మార్కెట్లు..కొన్ని రోజులు కరెక్షన్..కొన్ని రోజులు కన్సాలిడేషన్ అవుతాయ్. ఈ క్రమంలో ఈ పిఎస్‌యు స్టాక్స్ ర్యాలీ కొనసాగుతున్నా సరే..ఇవి ఇచ్చిన రిటన్స్ బట్టి చూస్తే..ఎంతో కొంత ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిందే. అందుకే

ఈ స్టాక్స్‌లో వారంలో రెండు సెషన్లు నష్టాలు కన్పిస్తున్నాయ్. ఈ నేపథ్యంలో చక్కని లాభాల్లో ఉన్న షేర్లలో కొంతమేర పెట్టుబడి

వెనుకకు తీసుకుంటే..సమీపభవిష్యత్తులోని ఒడిదుడుకులకు కుషన్‌గా పని చేస్తుందనేది అనుభవజ్ఞుల అభిప్రాయం

Comments