PSU సెక్టార్‌లో అమ్మకాల వెల్లువ..ఆపుతోన్న బ్యాంక్ నిఫ్టీ

 మార్కెట్లు నిన్నటి ధోరణినే కొనసాగిస్తున్నాయ్. స్వల్పలాభంతో ప్రారంభమై

నష్టాలతో ట్రేడవుతున్నాయ్.నిఫ్టీ 21629 స్థాయికి దిగిరాగా, సెన్సెక్స్ 71200 పాయింట్లకు

ఇంట్రాడేలో పతనం అయింది.నిన్న ఇదే సమయానికి సెన్సెక్స్ 72వేల పాయింట్లను

తాకి వెనుదిరగగా..అదే సీన్ ఈ రోజు 71600 దగ్గర ఎదురైంది


ఈ రోజు స్పష్టంగా కన్పించిన పరిణామం, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెక్టార్లలో భారీగా

అమ్మకాలు చోటు చేసుకోగా, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ సెక్టార్లు చెరో మూడున్నరశాతం

నష్టపోయాయ్. ఆటో,కేపిటల్ గూడ్స్ ఒకటిన్నరశాతం నష్టపోయాయ్.పిఎస్ఈ షేర్లు

నాలుగున్నరశాతం అమ్మకాల వెల్లువలో కొట్టుకుపోతుండగా, బ్యాంక్ నిఫ్టీ మాత్రమే పాజిటివ్‌గా

ట్రేడవుతోంది


ఐటిసి, ఐసిఐసిఐ బ్యాంక్, సన్‌ఫార్మా, ఎస్బీఐ,బ్రిటానియా ఒకటి నుంచి రెండుశాతంలాభాల్లో ఉండగా

ఓఎన్‌జిసి,కోల్ఇండియా, హిందాల్కో, ఎన్‌టిపిసి,బిపిసిఎల్ మూడు నుంచి నాలుగున్నరశాతం

నష్టపోయాయ్.  ఇవన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్‌కి లోనవుతున్నాయనడంలో సందేహమే లేదు

Comments