బ్యాడ్ రిజల్ట్స్ ఎఫెక్ట్,TCPని బాదిపడేస్తోన్న ట్రేడర్స్


FY24Q3లో టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్ రిజల్ట్స్ పైపైకి బాలేకపోవడంతో..ట్రేడర్లు 

ఈ కౌంటర్‌లో అమ్మకాలకు తెరలేపారు. దీంతో ఇంట్రాడేలో రూ.1134.05కి టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్

దిగి వచ్చింది. ఇది గత ముగింపు రేటుతో పోల్చితే దాదాపు రెండున్నరశాతం తక్కువ




టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ క్యు3 నికరలాభంలో 17.3శాతం క్షీణత నమోదు అయింది

రూ.301.50కోట్లకి పరిమితమైన లాభంలో..ఎక్సెప్షనల్ లాస్ రూ.91.53 కోట్లు కూడా ఉంది

ఇది మినహా ఆదాయంలో 9.5 శాతం పెరుగుదల నమోదై రూ.3804కోట్లకి చేరిన సంగతి కూడా

గుర్తుంచుకోవాలి. ఈ ఎక్సెప్షనల్ లాస్‌ని పక్కనబెట్టి చూస్తే..రిజల్ట్ ఫ్లాట్‌గా మారొచ్చు


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు రూ.1139 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments