'టాప్ 10లో టిసిఎస్‌కి టాప్ లేచిపోయింది

 



టాప్-10 అత్యంత విలువైన సెన్సెక్స్ కంపెనీల్లో ఐదు మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం ఏకంగా రూ.1,97,958.56 కోట్లు క్షీణించింది.  యాక్సెంచుర్ తన గైడైన్స్ తగ్గించిన తర్వాత ఐటీ ప్యాక్

లాస్ట్ వీకెండ్‌లో భారీగా నష్టపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది..ఆ కోవలోనే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ కేపిటలైజేషన్ రూ.1,10,134.58 కోట్లు తగ్గి రూ.14,15,793.83 కోట్లకు చేరుకుంది. 


ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.52,291.05 కోట్లు తగ్గి రూ.6,26,280.51 కోట్లకు చేరుకుంది. తర్వాత

 హిందుస్థాన్ యూనిలీవర్ మార్కెట్ విలువ రూ.16,834.82 కోట్లు తగ్గి రూ.5,30,126.53 కోట్లకు, ఎల్‌ఐసీ మార్కెట్ విలువ రూ.11,701.24 కోట్లు క్షీణించి రూ.5,73,266.17 కోట్లకు చేరుకుంది. ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,996.87 కోట్లు తగ్గి రూ.10,96,154.91 కోట్లకు తగ్గింది


రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాల్యుయేషన్ రూ.49,152.89 కోట్లు పెరిగి రూ.19,68,748.04 కోట్లకు చేరుకుంది. SBI మార్కెట్ కేపిటలైజేషన్ వేల్యూ  రూ.12,851.44 కోట్లు పెరిగి  రూ.6,66,133.03 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో ఐటీసీ మార్కెట్ క్యాప్ రూ.11,108.51 కోట్లు పెరిగి రూ.5,34,768.59 కోట్లకు చేరుకుంది. భారతీ ఎయిర్‌టెల్ విలువ రూ.9,430.48 కోట్లు పెరిగి రూ.6,98,855.66 కోట్లకు, ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,191.79 కోట్లు పెరిగి రూ.7,65,409.98 కోట్లకు చేరుకున్నాయి.





Comments