పేటిఎంకి జాకీలేస్తోన్న మోర్గాన్ స్టాన్లీ..ఇంకో 55% పెరుగుతుందిట..నమ్మాలా

 


4 పెద్ద బ్యాంకులు సహా అనేక బ్యాంకులకు థర్డ్ పార్టీ యుపిఐ యాప్ సర్వీసులకు

పేటిఎం అనుమతి తెచ్చుకోవడంతో స్టాక్ రేటు ఇవాళ అప్పర్ సర్క్యూట్ లాక్ చేసింది

ఇంట్రాడేలో రూ. వరకూ పెరిగింది



దీంతో వెంటనే మోర్గాన్ స్టాన్లే ఈ సంస్థ షేర్లకు 55శాతం అప్ సైడ్ పొటన్షియల్ ఉందంటూ ఊదరగొట్టడం

ప్రారంభించింది. అసలు జనవరి 31న ఆర్బీఐ నిషేధం విధించింది మొదలు..పేటిఎం స్టాక్‌ని చితకబాదడం ప్రారంభించింది

ఈ సంస్థనే..! పరిణామాల తర్వాత అంచనాలు వేయడం కాదు..ముందే పరిణామాలను అంచనా వేయలేకపోతే..ఇదిగో ఇలాంటి

బ్రోకరేజ్ సంస్థల నిర్వాకాలకు బలైపోవాల్సి ఉంటుంది. ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యవహారాలపై నిషేధం

విధించినప్పుడు విచక్షణ లేకుండా విశ్లేషణలు చేయడమెందుకు..ఇప్పుడేమో...ఫలానా నిర్ణయంతో వ్యాపారం బాగుపడుతుందని

అంచనాలేమిటి..? అసలు పేటిఎం అనేది వన్97 కమ్యూనికేషన్స్ గొడుగులో అవకతవకలకు పాల్పడిందన్నది నిజం

అందుకే ఈ రకపు నిషేధాన్ని ఎదుర్కొన్నది. ఆ కోణంలో సంస్థపై దర్యాప్తు జరుగుతున్నప్పుడు అది పూర్తయ్యేవరకూ

దూరంగా ఉండాలి..అంతేకానీ..వెంటనే స్టాక్ 55శాతం పెరగవచ్చని విశ్లేషణలతో రిటైల్ ఇన్వెస్టర్ల కొంప మరోసారి ముంచడమే అవుతుంది

ఈ స్టాక్ రేటు పెరగవచ్చు తగ్గవచ్చు కానీ..ఆరోపణల నిగ్గు మాత్రం తేలాల్సిందే కదా..!


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి పేటిఎం షేర్లు రూ.370.70 దగ్గరే లాక్ చేసి ఉన్నాయ్

Comments