మార్కెట్ల రీబౌండ్...నిన్నటి నష్టాల్లో 80శాతం కవర్

 మార్కెట్లు నిన్నటి భారీ నష్టాల తర్వాత కాస్త లాభంతో ట్రేడవుతున్నాయ్

21982 పాయింట్ల దగ్గర నిఫ్టీ ప్రారంభమై 22098 పాయింట్ల వరకూ పెరిగింది

ప్రస్తుతం ఓ వంద పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది


సెన్సెక్స్ 225పాయింట్ల వరకూ లాభపడింది. 72992 పాయింట్ల వరకూ పెరిగిన

సెన్సెక్స్ 73వేల పాయింట్ల మార్క్ అందుకునేదిశగా పయనిస్తోంది


బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్‌గా ట్రేడవుతుండగా, ఐటీ ఇండెక్స్ అరశాతం లాభపడింది

 మిడ్ క్యాప్ ఇండెక్స్ లాభాల్లో ఉంది. కేపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్,

పిఎస్ఈ సెక్టార్లు నిన్నటి నష్టాలను 80శాతం పూడ్చుకున్నాయ్


అదానీ ట్విన్స్, హీరోమోటోకార్ప్, హిందాల్కో,కోల్ఇండియా రెండు నుంచి ఐదుశాతం

లాభపడగా, టాటా,జెఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి ,సన్‌ఫార్మా, దివీస్, అరశాతం నుంచి

ఒకటిన్నరశాతం నష్టపోయాయ్

Comments