జేఎం పైనాన్షియల్ డౌన్ డౌన్


ఆర్థికఅవకతవకలకు పాల్పడిన జేఎం ఫైనాన్షియల్ షేర్లను ఇన్వెస్టర్లు వదిలించుకుంటుండగా

ట్రేడర్లు పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. దీంతో స్టాక్ వరసగా మరో సెషన్ కూడా పదిశాతం

పతనం అయింది. ఇంట్రాడేలో ఈ రోజు ఈ స్టాక్ రేటు రూ.79.20కి జారిపడింది



ఐపిఓ సబ్‌స్క్రిప్షన్లు, షేర్లను తాకట్టు పెట్టుకుని లోన్లు వగైరా కార్యక్రమాల్లో అనైతిక

కార్యకలాపాలు చేసినట్లు JM ఫైనాన్షియల్‌ లిమిటెడ్‌పై సెబీ కొరడా ఝళింపించింది. అంతేకాదు

తాజాగా పబ్లిక్ ఇష్యూలకి లీడ్ మేనేజర్‌గా వ్యవహరించకుండా నిషేధించింది. ఈ పరిణామాలు

స్టాక్ రేటుపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయ్. అందుకే వరసగా రెండో సెషన్ కూడా ఈ స్టాక్

చతికిలబడింది

Comments