స్మాల్‌క్యాప్ సెక్టార్ లో అమ్మకాల సునామీ


గడచిన 3 వారాలుగా..స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో భారీగా సెల్లాఫ్ వస్తోంది. 

మొత్తం ఇండెక్స్‌లో 80 శాతం కంపెనల షేర్లు ఇలా అమ్మకాలకు లోనవుతున్నాయ్

అంటే ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో ఓ స్టాక్ ఖచ్చితంగా నష్టపోయి ఉంటుంది. ఫిబ్రవరి 19 నుంచి

ఈ ట్రెండ్ కన్పిస్తోంది. ఇదే కాలంలో నిఫ్టీ మాత్రం ఒకశాతం ర్యాలీ చేసింది


సాధారణంగా ప్రతి చిన్న స్టాక్ పెన్నీ స్టాక్స్ పెరగడం అంటే..అదిక బుల్ ర్యాలీకి 

బ్రేక్ అనే సంకేతం అంటారు...కానీ ఇప్పుడు ప్రతి స్మాల్ క్యాప్ స్టాకూ..పెన్నీ స్టాక్ కాదనేది

గుర్తు పెట్టుకోవాలి


మరోవైపు ఈడీ దుబాయ్‌లో హరిశంకర్ టిబ్రేవాల్ అనే ఓ హవాలా ఆపరేటర్‌పై దాడి చేయడం గమనించాలి. ఇతగాడు సహా మరో 13 మోసపూరిత సంస్థలు

ప్రత్యేకంగా కొన్ని స్టాక్స్‌ ఆపరేట్ చేస్తున్నట్లు ED కనిపెట్టింది. ఈ వార్త కూడా ఇన్వెస్టర్లను వర్రీ చేసినట్లు చెప్తున్నారు. ఇదో గొలుసుకట్టు పరిణామాల్లాగా

మొత్తంగా స్మాల్‌క్యాప్ సెక్టార్‌లో ప్రాఫిట్ బుకింగ్, షార్ట్ సెల్లింగ్‌కి కారణమవుతోంది

Comments