ప్రి ఎలక్షన్ ట్రెండ్ కి సిద్ధం

 గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో అప్ అండ్ డౌన్ ట్రెండ్ నడిచింది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ షేర్లలో  కరెక్షన్  ఇన్వెస్టర్ల సంపదకి చిల్లు పెట్టాయనే చెప్పాలి. 



అమెరికాలో ఇన్‌ఫ్లేషన్ నంబర్స్,  డొమెస్టిక్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వంటి ఫ్యాక్టర్స్..మన మార్కెట్లపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించాయ్

ఇక ఈ వారంలో ఇన్వెస్టర్లకు ఇండియన్ బ్యాంక్ డిపాజిట్ అండ్ లోన్ గ్రోత్ డేటాని ఫోకస్ పెడతారని చెప్తున్నారు. అలానే అమెరికాలో వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం మన మార్కెట్లకు

ఓ దిక్చూచిలా తీసుకునేవాళ్లు ఎక్కువ. ఇక సర్వీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్-PMI నంబర్లు కూడా కాస్తో కూస్తో ప్రాధాన్యత కలిగినవే..ఐతే వాటన్నింటి కంటే ఎక్కువగా ఈ ఎలక్షన్ ప్రీపోల్ సర్వేలు కూడా సెంటిమెంటల్‌గా బాగానే ప్రభావం చూపవచ్చు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడిక నడిచేదంతా పోస్ట్ ఎలక్షన్ ట్రెండ్‌గానే చూడాలి

Comments