బోలెడు డెవలప్‌మెంట్...చదివే ఓపిక ఉందా

 జొమేటో

మొత్తం ఈక్విటీలో 2శాతం వాటాని అమ్మకానికి సిద్ధమైన యాంట్‌ఫిన్ సింగపూర్ పిటిఈ

ఆఫర్ సైజ్ రూ.2811 కోట్లు

నిన్నటి క్లోజింగ్ ప్రైస్ కంటే 3.9శాతం తక్కువ రేటుతో 17.64కోట్ల షేర్లతో బ్లాక్ డీల్



జేఎం ఫైనాన్షియల్

షేర్లను తనఖా పెట్టుకుని చేసే ఎలాంటి కార్యకలాపాలు చేయవద్దని ఆర్బీఐ ఆదేశం

ఐపిఓ షేర్ల విషయంలోనూ ఇదే రకమైన నిషేధం

ఎన్సీడీల సబ్‌స్క్రిఫ్షన్ల విషయంలో తీవ్రమైన తప్పిదాలు దొర్లినట్లు చెప్పిన ఆర్బీఐ


సంవర్ధన మదర్సన్

4.4శాతం వాటా విక్రయించనున్న సుమిటోమో వైరింగ్

ఫ్లోర్ ప్రైస్ రూ.118, మొత్తం డీల్ వేల్యూ 427 మిలియన్ డాలర్లు

ప్రస్తుతం 14.4శాతం వాటా కలిగి ఉన్న సుమిటోమో వైరింగ్


హవెల్స్ ఇండియా

కిచెన్ అప్లయెన్సెస్‌ని విక్రయించనున్న కంపెనీ

కుక్‌టాప్స్, హబ్స్, చిమ్నీ ఉత్పత్తులను లాంఛ్ చేయనున్న కంపెనీ


రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్

మార్చ్ 16న బోర్డ్ మీటింగ్

మూడో మధ్యంతర డివిడెండ్ ప్రకటనకు అవకాశం


ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్

మార్చ్ 10న బోర్డ్ మీటింగ్

డివిడెండ్ పై ప్రకటన


భారతి ఎయిర్‌టెల్

40.86 మిలియన్ డాలర్లకు సమానమైన 56.80లక్షల ఫారిన్ కన్వర్టబుల్ బాండ్లు

షేరుకు రూ.518 ధరతో అలాట్‌ చేయనున్న టెల్కో

సింగపూర్ ఎక్స్‌ఛేంజ్‌లో మొత్తం FCCB ప్రిన్సిపల్ వేల్యూ 337.96 మిలియన్ డాలర్లకు కుదింపు


టొరంట్ ఫార్మా

గుజరాత్ ఓరల్ ఆంకాలజీ ఫెసిలిటీకి USFDA  ఎస్టాబ్లిష్‌మెంట్ ఇన్స్‌పెక్షన్ రిపోర్ట్

ఐదు పరిశీలనాంశాలతో నివేదిక జారీ


కోల్ఇండియా

ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుతూ ప్రభుత్వ పర్యావరణశాఖ అనుమతి

సౌత్ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్ జెర్వా మైన్ల కెపాసిటీ 52.5 మిలియన్ టన్నుల నుంచి 70 మిలియన్ టన్నులకు పెంపు

ఆసియాలోనే అతి పెద్ద మైన్‌గా ఆవిర్బవించే అవకాశం


విప్రో

SDవెర్స్ ఎల్ఎల్‌సిలో వాటా

27శాతం వాటా కొనుగోలు విలువ 5.85మిలియన్ డాలర్లు

Comments