ఈ రోజు ఈ డెవలప్ మెంట్స్ చూసి ట్రేడ్ చేయండి

 ఐటిసి

బ్లాక్ డీల్ ప్రారంభం

బ్రిటిష్ అమెరికన్ టుబాకో 3.5శాతం వాటా విక్రయం

ఇన్సిట్యూషనల్ ఇన్వెస్టర్లకే ఈ వాటాల విక్రయం

మొత్తం డీల్స్ వేల్యూ రూ.16775కోట్లుగా అంచనా

రెండేళ్లుగా షేరు ధర పెరగడంతోనే లాభాలు పిండుకునేందుకు సిద్ధమైన BAT


జేజి కెమికల్స్

జింక్ ఆక్సైడ్ బిజినెస్ కంపెనీ ఈ రోజే లిస్ట్ అవుతుంది

షేర్ల  అలాట్‌మెంట్ రేటు రూ.221

మంచి ప్రీమియం దక్కేసూచన


వేదాంత

కెయిన్ యుకే హోల్డింగ్స్‌కి రూ.77.62 కోట్లు కట్టాల్సిందిగా సెబీ సూచన

డివిడెండ్ ఆలస్యంగా చెల్లించినందుకు 18శాతం వడ్డీతో కట్టాలని చెప్పిన సెబీ


ఇండోకో రెమిడీస్

అంధేరీలో 2860 చదరపు మీటర్ల భూమి కొనుగోలు

కొనుగోలుకు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ల కమిటీ అంగీకారం

సల్దన్హా రియాల్టీ అండ్ ఇన్‌ఫ్రా ఎల్ఎల్‌పి నుంచి కొనుగోలుకు రెడీ


హింద్‌వేర్ హోమ్ ఇన్నోవేషన్

సిఈఓ పదవి నుంచి వైదొలిగిన సలిల్ కపూర్

నిన్నటి నుంచే బాధ్యతల నుంచి తప్పుకున్న కపూర్


షాల్బీ

హీలర్స్ హాస్పటల్‌లో వందశాతం వాటా కొనుగోలు చేయనున్న కంపెనీ

రూ.104కోట్లకి కొనుగోలు


Comments