స్మార్ట్ సిటీస్...నీళ్లు లేవు బాసూ

డెవలప్‌మెంట్ పేరుతో కాంక్రీట్ జంగిల్స్ నిర్మించుకుని మురిసిపోతున్న జనాలకు వేసవి చుక్కలు చూపెడుతోంది. తాగడానికి కాదు కదా..వాడకానికికూడా నీళ్లు లేక పాష్ పీపుల్ అల్లాడిపోతున్నారు కావాలంటే ఈ  ఇన్సిడెంట్ చూడండి



బెంగళూరులో ఈ రోజు ఉదయం..ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ పోష్ కమ్యూనిటీ జనం అంతా పక్కనున్న సూపర్ మార్కెట్‌, షాపింగ్ మాల్స్‌కి పోయి వాష్‌రూమ్ అవసరాలు తీర్చుకున్నారుట. అంతేకాదు నీళ్లు లేక..డిస్పోజబుల్ ప్లేట్లు వాడటం ప్రారంభించారట. ఇది ఎక్కడో

విదేశాల్లో అంటే సరే కానీ..మన దేశంలో..అఁదులో ఇండియన్ సిలికాన్ వేలీకి ఇదేం గతిరా బాబూ అనుకుంటుంటే..మరి నీళ్లు లేని

నగరాల్లో ఇలా కాక ఇంకెలా ఉంటుందనే నిజవాక్కులూ ఉన్నాయ్. పైగా ఇలాంటి గేటెడ్ కమ్యూనిటిల కోసమే కోటిన్నర, రెండుకోట్లు ఖర్చు పెట్టి

ఫ్లాట్‌లు కొనుగోలు చేస్తారు..తీరా చూస్తే..కనీసం అవసరాలు కూడా తీర్చలేనప్పుడు అందులో ఉండి ప్రయోజనం ఏంటి


ఈ దెబ్బతో అపార్ట్‌మెంట్లు కూడా ఖాళీ చేసి..నీటి వసతి ఉన్నచోటకు తరలిపోతున్న దృశ్యాలు కూడా కన్పిస్తున్నాయ్. 

ఇంచుమించి ఇలాంటి స్థితి హైదరాబాద్‌కి రాదని గ్యారంటీ లేదు..గత ఏడాది ఏప్రిల్‌లో బోర్వెల్స్ కంపెనీలు లాభం చేసుకున్న

సంగతి ముచ్చటించుకున్నాం..ఇప్పుడు మార్చి మొదటివారంలోనే బోర్ వెల్స్ వాహనాలు సిటీలో హోరెత్తిస్తున్నాయ్.

భారీ వర్షాలు పడినా..అవి ఇంకడానికి భూమి లేకపోతే ఇలానే ఉంటుంది. అంతేకాదు..కనీసం ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే

పరిస్థితిని కాస్త చక్కదిద్దవచ్చని జ్ఞానం పాలకులకు లేకపోతే పోయింది..కనీసం అపార్ట్‌మెంట్ వాసులకైనా ఉండాలి కదా..ఎక్కడిక్కడ

కమిషన్లతో పాలసీలు మార్చుకోవడమే తప్ప..రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఉండి  ప్రయోజనం ఏంటి..1500 అడుగుల లోతున డ్రిల్ చేసినా

నీళ్లు దొరకని పరిస్థితి ఉంటే..!









Comments