వెర్రెక్కిపోకండి..అమ్మేసుకోకండి..ఇది తాత్కాలికం

 



మార్కెట్లో వరసగా అమ్మకాల సెషన్లతో..రిటైల్ ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు

ఐతే ఇది తాత్కాలికం అని..ఈ కరెక్షన్ చూసి ప్యానిక్ అయిపోయి స్టాక్స్ అమ్మేసుకోవద్దని

మార్కెట్లలోని అనుభవజ్ఞులు సూచిస్తున్నారు. ఫండమెంటల్‌గా పిక్చర్ సాలిడ్‌గా ఉందని

అలాగని ఫ్రెష్‌గా కొనుగోళ్లకి దిగడానికి కూడా ఇది సమయం కాదనేది వారి పాయింట్



టెక్నికల్‌గా ట్రెండ్ వీక్‌గా ఉందనేది కన్పిస్తూనే ఉంది. ఐనా కొన్ని అంతర్జాతీయ పరిణామాలు

పూర్తైన తర్వాత కొంత స్టెబిలిటీ రావచ్చని కోటక్ సెక్యూరిటీస్ శ్రీకాంత్ చౌహాన్ చెప్తుండగా, 

కరెక్షన్ చాలా బలంగా ఉందని..ఐతే దాన్ని సపోర్ట్ చేసే అంతర్జాతీయ పరిణామాలు లేవని

నిఫ్టీ 21750 పాయింట్ల మార్క్ కూడా దిగితే అప్పుడు ఇంకాస్త కరెక్షన్ ఉంటుందని వెల్త్‌‌మిల్స్‌కి చెందిన క్రాంతి బత్తిని

చెప్తున్నారు

Comments