లాభంతో ప్రారంభం, HDFC బ్యాంక్ ర్యాలీ

 స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభంతో ప్రారంభం అయ్యాయ్. నిఫ్టీ

నిన్నటి ముగింపుతో పోల్చితే 100 పాయింట్ల వరకూ లాభపడింది. ఐతే తర్వాత

ఫ్లాట్‌గా మారింది. ప్రస్తుతం 22360 పాయింట్ల దగ్గర కొద్దిపాటి లాభంతో ఉంది


సెన్సెక్స్ మాత్రం మంచి ఉత్సాహంగా ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 74వేల పాయింట్లను

మరోసారి క్రాస్ చేసి 515 పాయింట్లు లాభపడింది. ప్రస్తుతం 200కిపైగా పాయింట్ల లాభంతో

73716 పాయింట్ల దగ్గర ట్రేడ్ అయింది


బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్‌గా,ఐటీ ఇండెక్స్ అరశాతం లాభంతో ట్రేడవుతోంది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్

స్టాక్స్ భారీగా నష్టాలపాలవుతున్నాయ్. ఎఫ్ఎఁసిజి, మెటల్, పిఎస్ఈ, హెల్త్‌కేర్ సెక్టార్లు

ఒకశాతం వరకూ నష్టపోయాయ్. ఆటో సెక్టార్ పావుశాతం నష్టంతో ట్రేడవుతున్నాయ్


HDFC బ్యాంక్, టిసిఎస్, ఐషర్ మోటర్స్, ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఇన్ఫోసిస్ ఒకటి నుంచి రెండుశాతం

వరకూ లాభపడగా, సిప్లా, ఐటిసి, గ్రాసిం, బజాజ్ఆటో, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఒకటింబావు నుంచి రెండుంబావు శాతం నష్టపోయాయ్


Comments