లాభం నుంచి నష్టాల్లోకి...PSUని చితకబాదుతోన్న జనం

 స్టాక్ మార్కెట్లు  బుధవారం కూడా నిన్నటిలానే లాభాలతో ప్రారంభమై

నష్టాల్లోకి జారుకున్నాయ్.నిఫ్టీ 110 పాయింట్లు నష్టపోయి 22224 పాయింట్లకు

జారింది. సెన్సెక్స్ 200 పాయింట్లు వరకూ నష్టపోగా, బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్‌గా

ట్రేడవుతోంది.


మిడ్ క్యాప్ ఇండెక్స్ రెండున్నరశాతం నష్టపోయింది. స్మాల్ క్యాప్ సెక్టార్‌లోఅమ్మకాల సునామీ

కొనసాగుతోంది. ఆటో,కేపిటల్ గూడ్స్ సెక్టార్లు వీటికి ధీటుగా నష్టపోతున్నాయ్.కన్జ్యూమర్ డ్యూరబుల్ ,ఎఫ్ఎంసిజి,హెల్త్ కేర్ అన్నీ ఒకటిన్నరశాతం నష్టపోయాయ్. మెటల్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్

సెల్లింగ్ ప్రెజర్ విపరీతంగా ఉండగా, పిఎస్ఈ స్టాక్స్ బ్లీడవుతున్నాయ్. ఐతే పతనం మాత్రం ఓ మాదిరిగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం

అంటే మార్కెట్లను కేవలం ఐటిసి..ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రమే నిలబెడుతుండగా, బ్రిటానియా, నెస్లే కోటక్ మహీంద్రా ఓ చేయి వేస్తున్నాయ్. ఇవి అరశాతం నుంచి ఒకటిన్నరశాతం లాభపడ్డాయ్

లూజర్లుగా పవర్ గ్రిడ్, ఎన్టిపిసి, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, కోల్ఇండియా నాలుగు నుంచి ఆరుశాతం నష్టపోయాయ్. ఇవన్నీ కూడా కొంతకాలంగా భారీ ర్యాలీ చవిచూసినవే


Comments