ఈ PSU స్టాక్స్ నష్టాలకు కారణం ఇదే


NTPC,ONGC,BPCL, కోల్ఇండియా సహా పద్నాలుగు పబ్లిక్ సెక్టార్ యూనియన్ స్టాక్స్‌లో

కొద్ది రోజులుగా నష్టాలు వాటిల్లుతున్నాయ్. ఈ మేరకు మార్కెట్లలో ఓ కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఇక ఈ ర్యాలీ అయిపోయి..డౌన్ ట్రెండ్ ప్రారంభమైందా..లేక ఇది తాత్కాలికమా అనేదే ఆ  గందరగోళం



ఐతే, ఆరు నెలల క్రితం రేట్లతో పోల్చితే ఈ స్టాక్స్ నష్టపోయింది 20శాతం మాత్రమే..కాబట్టి లోయర్ లెవల్స్‌లో

వీటిని ఒడిసిపట్టుకున్నవారికి ఇబ్బందేం లేదు..పైగా కొందరు చెప్తున్నదాని ప్రకారం ఓవరాల్ మార్కెట్ల

కరెక్షన్ 80శాతం అయిపోయింది. ఇక మిగిలిన 20శాతాన్ని లెక్కగట్టినా..ఈ సెక్టార్ స్టాక్స్‌కి వచ్చిన ఢోకా లేదు


IRFC,SVJN లాంటి కంపెనీలతో పాటు..పైన పిఎస్‌యులలో అమ్మకాలకు కారణం, మ్యూచువల్ ఫండ్

హౌస్‌లు తమ వాటాలను వెనక్కి తీసుకోవడం, లాభాలను పిండుకోవడమే లక్ష్యంగా  ఈ అమ్మకాలు సాగాయి. అంతే తప్ప

వాటి ప్రాస్పెక్టస్‌లో వచ్చిన మార్పులేదు. అందుకే..ఈ స్టాక్స్‌లో లోయర్ లెవల్స్‌లో కొనుగోలు చేయడం సరైన వ్యూహమవుతోందని

సంజీవ్ బాసిన్ లాంటి ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు 

Comments