వోడా...మామూలుగాలేదే ఐడియా..18వేలకోట్ల మెగా ఎఫ్‌పిఓ


నష్టజాతక కంపెనీగా మూడేళ్ల క్రితం తనపై పడ్డ ముద్ర తొలగించుకునేందుకు

వొడాఫోన్ ఐడియా చేస్తోన్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చేశాయ్. ఇన్వెస్టర్ల నుంచి

బ్యాంకర్ల నుంచి తెగ అప్పులు సంపాదించిన ఈ కంపెనీ..ఇప్పుడు ఎఫ్‌పిఓతో మరో 18 వేల కోట్లు

సేకరించబోతోంది. ఇందుకోసం...ఏప్రిల్ 18 నుంచి ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్ ఇస్తోంది. ఇందులో ఫ్లోర్ ప్రైస్

షేరుకు రూ.10 ఫిక్స్ చేసింది. కేప్ ప్రైస్ రూ.11




ఏప్రిల్ 22తో vodafone idea FPO క్లోజ్ అవుతుంది


ఒక్కో ఇన్వెస్టర్ 1298 షేర్ల చొప్పున కొనుగోలు చేయవచ్చు..అలా 12980 రూపాయలతో మినిమమ్ ప్రైస్ బిడ్, ఇదే అప్పర్ బ్యాండ్ రేటు చూసినప్పుడు 14278 కోట్లతో బిడ్ వేయాలి. 


ప్రమోటర్ ఎంటిటీ ఓరియనా ఇన్వెస్ట్‌మెంట్స్ పిటీఈకి ప్రిఫరెన్షియల్ షేర్లను అలాట్ చేయడంతో..కంపెనకి

రూ.2075 కోట్లు రాగా..ఇప్పుడు మరో 18వేల కోట్లను సమీకరించనుంది. ఈ 20వేల కోట్ల సమీకరణకు

ఫిబ్రవరి 17న జరిగిన బోర్డ్ మీటింగ్‌లోనే సంస్థ అనుమతి పొందింది


ఈ మధ్యనే సిఎల్ఎస్ఏ అనే బ్రోకరేజ్ సంస్థ వొడాఫోన్ ఐడియా షేర్లు రూ.5కి కూడా పతనం అవుతాయని చెప్పింది. ఈ మధ్యకాలంలో సంస్థకి చెందిన 17 మిలియన్ యూజర్లు గుడ్‌బై చెప్పడమే ఇఁదుకు కారణభూతమవుతుందని చెప్పుకొచ్చింది.


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి వొడాఫోన్ఐడియా షేర్లు రూ.12.40 ధర దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments