ఆల్‌టైమ్ హై మార్క్ నౌ @22619


స్టాక్ మార్కెట్లు ఈ రోజు గత మూడు సెషన్లలో చోటు చేసుకున్న స్తబ్దతని బ్రేక్ చేశాయ్

మరోసారి ఆల్ టైమ్ రికార్డులను చెరిపేశాయ్. నిఫ్టీ 22619 పాయింట్లకు ఎగసింది. దాదాపు 

200 పాయింట్లు లాభపడింది. ఆ తర్వాత ఆ లాభమంతా కోల్పోయి 100 పాయింట్లు 

నష్టపోయింది. దీంతో హయ్యర్ లెవల్స్ దగ్గర నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ కన్పించింది



సెన్సెక్స్ కూడా 74501 పాయింట్ల మార్క్ తాకింది. తదుపరి లాభాల దండుకోవడంతో

370 పాయింట్లు పతనం అయింది. ఇక్కడ స్వింగ్ దాదాపు వెయ్యి పాయింట్లు నమోదు అయింది


బ్యాంక్ నిఫ్టీ పావుశాతం లాభంతో ఉండగా, ఐటిఇండెక్స్ నిన్నటి లాభాలను కోల్పోయింది

అన్ని రంగాలు నష్టాల్లో కన్పిస్తుండగా, ఆయిల్ అండ్ గ్యాస్‌లో ప్రాఫిట్ బుకింగ్ చాలా

ఎక్కువగా కన్పిస్తోంది. మెటల్,కేపిటల్ గూడ్స్‌లోనూ డిటో సీన్ కన్పిస్తోంది


ఐతే నిఫ్టీలో ఇప్పటికి కూడా ఎన్టిపిసిటాప్ గెయినర్‌గా రెండో రోజు కూడా తన ప్రభ

వెలిగిపోతుండగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, దివీస్ల్యాబ్స్, కోల్ఇండియా, పవర్ గ్రిడ్ కార్పోరేషన్

అరశాతం నుంచి రెండున్నరశాతం వరకూ లాభపడ్డాయి.  శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిం, ఇండస్ఇండ్ బ్యాంక్

సన్‌ఫార్మా, భారతి ఎయిర్‌టెల్ రెండుశాతం వరకూ నష్టపోయాయ్

Comments