ఈ రోజు కూడా లాభమే...షార్ట్స్ జోలికి పోవద్దు

  మార్కెట్లు నిన్న కూడా అత్యధిక స్థాయిలకు

చేరాయి..ముగిశాయి..నిఫ్టీ 22768 పాయింట్లకు చేరి

22642పాయింట్ల దగ్గర ముగిసింది


సెన్సెక్స్ 75124 పాయింట్లపైకి చేరి..74683 పాయింట్ల దగ్గర నిలిచింది


సో..మార్కెట్లలో గరిష్టాలదగ్గర లాభాలు పిండుకునే ప్రక్రియ ఓ వైపు కొనసాగుతోంది

మరోవైపు కాస్త తగ్గగానే కొత్తగా కొనడమూ కన్పిస్తోంది. ఐతే ఈ మధ్యలో హయ్యర్ లెవల్స్ దగ్గర షార్ట్స్ కొట్టి ఇరుక్కుంటే మాత్రం విలపించాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. సెంటిమెంట్ విపరీతమైన బుల్లిష్‌గా ఉన్న సమయంలో..నిఫ్టీ 23వేల పాయింట్లును తాకడం పెద్ద విషయం కాదు..21 వేల నుంచి ఎకాఎకిన 23వేల పాయింట్ల వరకూ( ఇంకా రాలేదనుకోండి) వచ్చిన నిఫ్టీ..ఎక్కడోచోట కాస్త రివర్స్ అవడం సహజం. అంత మాత్రాన పెరిగేకొద్దీ షార్ట్స్ కొడుతూ పోతే..ఏప్రిల్ సిరీస్ ఎండింగ్‌కి వస్తుంది.. 

టెక్నికల్‌గా నిఫ్టీ 22750-22800 మధ్య కీలకమైన స్థాయిగా HDFC సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ చెప్తున్నారు. ఈ 250 పాయింట్లు దాటితే..23వేల పాయింట్ల మార్క్ కాగా..ట్రెండ్ రివర్స్ అయ్యే సూచనలు లేవనేది ఆయన  పాయింట్. ఇదే సమయంలో 22500 దగ్గర పుట్ రైటింగ్స్ ఎక్కువ ఉన్నాయ్. అంటే ఇదే నిఫ్టీకి

సపోర్ట్ లెవల్‌గా కూడా చూడొచ్చు. 


బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉత్తరదిశగా జైత్రయాత్ర సాగుతోంది. 48960 పాయింట్ల దగ్గర

కొత్త గరిష్టాన్ని నమోదు చేసిన బ్యాంక్ నిఫ్టీ,  గత ఐదు సెషన్లుగా లాభపడుతున్న సంగతి గమనించాలి.  ఈ క్రమంలో50వేల పాయింట్ల వైపు కదలడం ఖాయం..సెంటిమెంట్ బలంగా ఉంది కాబట్టి..ఆ పని వచ్చేవారమా..ఈ వారంలోనే జరుగుతుందా చూడాలి


Comments