రామ్‌దేవ్, బాలకృష్ణలకు సుప్రీంకోర్టు పిచ్చ కోటింగ్...స్ట్రాంగ్ వార్నింగ్..ఇక కాస్కోనా రాజా

 సాగినంత కాలం తమఅంత వారు లేరందరు..కాలం తిరగబడితే..

అన్నట్లుగా..ఉందిప్పుడు రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ పరిస్థితి. ఇష్టం వచ్చినట్లు

ప్రకటనలు ఇవ్వడం..అక్రమమార్గాల్లో వ్యాపారం చేయడం( ఇదింకా బైటపడలేదు)

తో పాటు ప్రతిదానికి హిందూ ముసుగు వేసిన రామ్‌దేవ్‌కి ఇప్పుడు సుప్రీంకోర్టు

అక్షరాలా చుక్కలు చూపిస్తోంది. 



తాజాగా కోర్టు ధిక్కారం నేరంలో బేషరతుగా క్షమాపణ చెప్పినా సరే వీరిద్దరినీ కోర్టు

వదిలేది లేదని చెప్పేసింది. మీ బోడి సారీ ఎవడికి కావాలి ..చర్యలుంటాయ్ కాస్కో మంటూ

హెచ్చరించింది. 

అసలు జనాలకు దీంతో ఓ మెసేజ్ వెళ్లాలి. ఎలాంటి మందులను మీరు బైటికి తీసుకువస్తున్నారు. ఎవరిఇష్టానుసారం వాళ్లు ప్రకటనలు ఇచ్చుకుంటూ పోతే చూస్తూ ఉండాలా అంటూ...తీవ్రస్థాయిలో జడ్జిల బెంచ్ మండిపడింది. జస్టిస్ హిమాకోహ్లి, అహ్సనుద్దీన్ అమానుల్లా, బెంచ్ ఈ కేసుని విచారిస్తుండగా...కోర్టులో తమ క్షమాపణ చెప్పడానికి ముందే..ఆ అఫడివిట్‌ని గొప్పగా మీడియా ముందు ప్రదర్శించడాన్ని తప్పుబట్టింది. 


పతంజలి సంస్థ అమ్ముతున్న ఉత్పత్తులు..వాటి ప్రకటనలపై ఉత్తరఖండ్ ప్రభుత్వం ఊరికే చూస్తూ ఉండటాన్ని 

కూడా సుప్రీంకోర్టు మండిపడింది. కావాలనే కళ్లు మూసుకున్నారంటూ వ్యాఖ్యానించింది. పైగా తమ 

ఉత్పత్తులు ఆయుర్వేదాన్ని జనాలను అనుసంధానిస్తున్నాయంటూ చెప్పడాన్ని సునిశితంగా విమర్శించింది. 

ఏదో ఆయుర్వేదం ఏదో వాళ్లే కనుక్కున్నట్లు బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేసింది కోర్ట్ బెంచ్!


పతంజలి తయారు చేసిన కొన్ని ఉత్పత్తులు..ఫలానావ్యాధులకు చికిత్స కోసమని..ప్రకటనలు గుప్పించింది. దీన్నే

కోర్టు తప్పుబట్టింది. అసలు ఇవి మందులే కాదనే విషయం తెలపాలని..అలానే ఇతర ఏ మందులకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్స్ ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ముందు తలాడించిన రామ్ దేవ్ బాబా కంపెనీ ...తర్వాత మాత్రం దాన్ని పక్కనబెట్టేసి యాడ్స్ ని యెడా పెడా వాడేసింది. దీంతో

కోర్టు ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా సీరియస్‌గా తీసుకుంది. పదే పదే క్షమాపణలుచెప్పినా పట్టించుకోకుండా..ఈ కేసు  ఓ బెంచ్ మార్క్‌గా మిగిలిపోవాలనే రీతిలో ప్రస్తుతానికి స్పందించింది


Comments

  1. న్యాయమూర్తుల అభ్యంతరం ఆయన కరోనాకి అల్లోపతిలో నివారణ లేదని ప్రకటనలు ఇవ్వడం గురించి అట.అది హఠాత్తుగా బైటపడి ఔషధాల్ని కనుక్కునే సమయం లేకపోవడమూ పైన అది మనిషి జీవించి ఉండటానికి అతి ముఖ్యమైన శ్వాసకోశాల మీద దాడి చెయ్యడమూ అనే రెండు కారణాల వల్లనే కదా లాక్ దౌన్ పెట్టి ఇళ్ళలో కూర్చోబెట్టి ఒకవేళ బైటికి వెళ్తే సోషల్ డిస్టెన్సింగ్ పాటించమని చెప్పింది!
    దాన్ని నివరించే పధ్ధతులే ఉంటే పరిశ్రమల్ని కూడా మూసేసి ఆర్ధిక రంగం కుదేలవుతున్నా రెండేళ్ళ పాటు బలవంతపు లాక్దౌన్ ఎందుకు కొనసాగించింది కేంద్ర ప్రభుత్వం?రాం దేవ్ బాబా మీద కేసు వేసిన IMAకి తెలుసా కరోనాకి సరైన నివారణ ఏంటో?సరైన నివారణఒక్కో పేషెంటు నుంచి రోజుకి లక్షల్లో వసూలు చేసిన అపోలో గిపోలో మెడ్విన్ డెడ్విన్ లాంటి పోరంబోకు హాస్పటల్సు కూడా మహారాజశ్రీ IMA సిఫార్సు చేసి కరోనా శిబిరాల్లో ఇచ్చిన పారా సిటమాలూ విటమిన్ టాబ్లెట్లు తప్ప ఇది కరోనాని తగ్గించేది అని చెప్పి ఒక్క మందు కూడా ఇవ్వ లేదు కదా!" ఫలానా మందుని మేం కరోనాకి నివారణ అని చెప్పాం,ఇచ్చాం" అని ఇప్పుడు IMA సాక్ష్యం చూపించి నిర్ధారించి చెప్పగలదా?ఆ పాయింటుని కోర్టుముందు IMA నిరూపిస్తే కదా రాం దేవ్ బాబా ప్రకటన "ప్రజలని తప్పు దోవ పట్టంచటం" అనే సెక్షను కిందకి వస్తుంది!" ఫలానా మందుని మేం కరోనాకి నివారణ అని చెప్పాం,ఇచ్చాం" అని ఇప్పుడు కోర్టుముందు IMA సాక్ష్యం చూపించి నిర్ధారించి చెప్పలేనప్పుడు రాం దేవ్ తరపు లాయరు తెలివైన వాడు అయితే IMA మీద పరువునష్టం దావా వేస్తాడు,మహారాజశ్రీ ప్రభుత్వ సంస్థ యొక్క ప్రధానాధికారి నుంచి సారీ+ఫైను కక్కిస్తాడు.
    కరోనాకి వ్యారియంట్ ఇండిపెండెంట్ వ్యాక్సిన్లు కనుక్కోవడానికే రెండేళ్ళు పట్టింది.వ్యాక్సిన్లు కనుక్కుని అవి ఇచ్చాకనే క్దా లాక్ దౌన్ ఎత్తేశారు.ఆ వ్యాక్సిన్లని కూడా మామూలప్పుడు పాటించే జాగ్రత్త్తల్ని తీసుకోక అతయ్వసర సర్వీసు కింద గబగబా తయారు చేసి పటపటా మార్కెట్లోకి వదిల్తే వ్యాక్సిన్లకి సైడ్ ఎఫెక్ట్ అనిపించేలా ప్రజలు,మరీ టీనేజి కుర్రాళ్ళు కూడా హఠాత్తు గుండెపోట్లకి గురయి చచ్చిపోయారు.వీటికి IMA ఏం జవాబు చెప్పింది?

    ReplyDelete
  2. సర్వోన్నత నయయస్థానం రాం దేవ్ బాబా యొక్క వాక్స్వాతంత్య్రం అనే ప్రాధమిక హక్కును హరించేస్తున్నది.న్యాయమూర్తులు అతని పట్ల వ్యవహరుస్తున్న తీరులో దూరహంకారం కనిపిస్తున్నది - అతను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూ సన్యాసి అనే వర్గానికి మోడర్న్ సైన్సు గురించి ఏమీ తెలియదని అనుకుంటున్నారో అసలు హిందూసన్యాసులు అల్లోపతి గురించి మాట్లాడనే కూడదని అనుకుంటున్నారో అర్ధం కావడం లేదు నాకు.

    ReplyDelete

Post a Comment