డౌన్ సైడ్ ట్రేడింగ్ ,టాప్ గెయినర్ NTPC

 


మార్కెట్లలో డౌన్‌వే ట్రేడింగ్ కొనసాగుతోంది.బుధవారం ఓపెన్ కావడమే 20929 దగ్గర ప్రారంభమైన నిఫ్టీ 20800 స్థాయికి కూడా దిగి వచ్చింది. సెన్సెక్స్ ఇవాళ మరో 350 పాయింట్లు పతనమైంది. 


బ్యాంక్ నిఫ్టీ అరశాతం వరకూ నష్టపోగా, ఐ,టి ఇండెక్స్ 2శాతం వరకూ పతనం అయింది. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్,కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అరశాతం లోపు నష్టపోగా, పిఎస్ఈ స్టాక్స్ మాత్రం ర్యాలీ చేస్తున్నాయ్. ఐటీ, బ్యాంకెక్స్‌ పాజిటివ్‌గా  వస్తే చాలు ఇండెక్స్‌లు కోలుకునేలా ట్రెండ్ కన్పిస్తోంది. రివర్సైతే..మరింతనష్టపోవడం ఖాయం


టాప్ గెయినర్ల జాబితాలో ఎన్టిపిసి, హీరోమోటోకార్ప్, పవర్ గ్రిడ్, ఐషర్ మోటర్స్, బిపిసిఎల్ ఒకటి నుంచిరెండున్నరశాతం వరకూ లాభపడ్డాయి. లూజర్లలో ఇన్ఫోసిస్,టిసిఎస్, హెచ్‌సి‌ఎల్ టెక్,HDFC లైఫ్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్టీఐ మైండ్‌ట్రీ ఒకటిన్నర నుంచి రెండున్నర శాతం వరకూ నష్టపోయాయ్

Comments