దంచిపారేస్తోన్న NTPC


పిఎస్యూ స్టాక్స్‌లో ర్యాలీ కొనసాగుతోంది. ప్రత్యేకించి నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్

స్టాక్ ఈ రోజు 5శాతం వరకూ లాభపడి పాత గరిష్టధరలను తుడిచిపెట్టేసింది. ఇంట్రాడేలో రూ.356.70 దగ్గర న్యూ 52వీక్స్ హై రేటు క్రియేట్ చేసింది



ఈ కౌంటర్ జోరు చూస్తుంటే ముచ్చటేస్తుంది.ఒకప్పుడు కేవలం బొగ్గు ఆధారిత పవర్ ప్రొడ్యూసింగ్

కంపెనీగామాత్రమే చూసే ఈ కంపెనీ..ఇప్పుడు తన వ్యాపార ధోరణి మార్చుకుంది. ఈవీలకు

సప్లై చేయగలుగుతుంది. అలానే గ్రీన్ హైడ్రోజన్ బాటపట్టింది. దీంతో..అపరిమితమైన వాణిజ్యఅవకాశాలు ఉంటాయనే నమ్మకంతో జనం ఈ స్టాక్‌ని కొనుగోలు చేసేందుకు వేలంవెర్రిగా పరుగు పెట్టారు..పెడుతున్నారు

ఈ క్రమంలోనే  ఈ స్టాక్ రెండేళ్లక్రితం రూ.170 నుంచి...అప్రతిహతంగా ప్రస్తుత రేటుకు ఎగబాకింది


ఈ స్టాక్ ప్లస్ పాయింట్లు ఇవి కాగా..మైనస్ పాయింట్లుగా కొంతమంది, మ్యూచువల్ ఫండ్ హౌస్లు

వాటా తగ్గించుకోవడాన్ని చెప్తున్నారు. మరి తక్కువ స్థాయిలో కొనుగోలు చేసినవారు...ప్రాఫిట్ బుక్

చేసుకోవడంలో తప్పేముంది..అలానే కొత్త ఇన్వెస్టర్లు కూడా NTPC కౌంటర్‌పై ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టే ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులు..కొత్త రేట్లతో హాట్ స్టాక్‌గా మారింది


స్టోరీ పబ్లిష్ చేసే సమయంలోనే NTPC రూ.357.45కి కూడా చేరింది..ఇదీ ఈ స్టాక్ ట్రెండ్

Comments