కడప పవర్ లేదా


ప్రపంచమంతా ఆల్టర్నేటివ్ పవర్‌వైపు చూస్తోంది. సూర్యరశ్మినుంచి విద్యుత్ ఉత్పతి చేయడమనేది కాస్త ఖరీదైన వ్యవహారంగా గతంలో ఉండేది.ఐతే ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. యూనిట్‌కి రూ.2.65 వరకూ కూడా రేటు తగ్గిపోయింది. మరి అలాంటి దశలో ఏపిలో ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకి తన కరెంట్ కొనేవాళ్లే లేకపోవడం విచిత్రం. అందులోనే బెస్ట్ ఆంట్రప్రెన్యూర్ సిఎంగా చెప్పుకునే చంద్రబాబునాయుడు రాష్ట్రంలో కావడం మరీ విచిత్రం. ఎందుకంటే సంస్కరణలకు పెద్దపీట వేస్తారని ఆయనకి పేరుంది.250 మెగావాట్ల పవర్ ని సోలార్ డైరక్ట్-ఎంజీ అనే ఫ్రెంచ్ సబ్సిడరీ  కొనుగోలు చేసింది. అది కూడా  కిలోవాట్ హెట్జ్ పవర్ ని రూ.3.45 వద్ద కోట్ చేసింది. ఐతే ఆ తర్వాత ఎంజీ గ్రూప్ కి ఈ టెండర్ అలాట్ చేసినట్లుగా ఎన్‌టిపిసి నుంచి ఎలాంటి అధికారిక ధృవపత్రమూ లేకుండా పోయింది. సాధారణంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ వేలం ముగిసిన రెండు మూడు నెలల్లో కుదిరిపోవాలి. ఐతే ఇలాంటిది ఏదీ కూడా ఈ రెండు సంస్థల మధ్యా జరగలేదు. దీంతో కడప సోలార్ ప్రాజెక్ట్ గతి అగమ్యగోచరంగా
మారినట్లు చెప్పుకుంటున్నారు. ఐతే ఇదేదీ ఇంకా బైటికి రాలేదు. లేదంటే విపక్ష పార్టీలు గగ్గోలు పెట్టడం ఖాయం.

న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ కూడా ఈ విషయంపై ఎలాంటి కామెంట్ చేయడం లేదు. దానికి ఎఁజీ సంస్థ తాలుకూ పెద్ద పేరే కారణమంటున్నారు. అటు ఫ్రాన్స్‌లో ఇటు ఇండియాలో ఈ కంపెనీనే అతి పెద్ద సోలార్ పవర్ వినియోగదారుగా చెప్తున్నారు.ఈ మొత్తం ఎపిసో‌డ్‌లో ఏపీ డిస్కమ్‌ల వ్యవహారశైలి అనుమానాస్పదంగా కన్పిస్తోంది. ఓ పక్క రాజస్థాన్‌లో సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేలం నిర్వహిస్తే యూనిట్‌కి రూ.2.36-2.44వరకూ ధర పలికింది. అందుకే ఇప్పుడు ఎంజీ గ్రూప్ కోట్ చేసిన ధరకి కరెంట్ కొనడం అంత మంచిదికాదనే ఒప్పందం జోలికి పోవడం లేదని కూడా ఓ వాదన ఉంది. మరోవైపు ఎన్‌టిపిసి కూడా సొంతంగా ఉత్పత్తి చేస్తోన్న పవర్ ను అమ్ముకునేందుకు నోడల్ ఏజెన్సీలను ఆశ్రయిస్తోంది.

Comments