రాహుల్ ...పంచ్‌లు పేలుస్తున్నాడు


ఇప్పుడు కావచ్చు..తర్వాతెప్పుడైనా కావచ్చు..కాంగ్రెస్‌కి రాహుల్ గాంధీనే కాబోయే అధ్యక్షుడు అందులో డౌట్ లేదు. మోడీ పల్లకి మోసే బోయీలకి అతనో బుధ్దావతారం అయితే అయి ఉండొచ్చు కానీ..ఇప్పుడా బుద్దూ పేల్చుతోన్న పంచ్‌లకు పాపం ఇప్పుడు అంత పెద్ద స్కందావారంలో ఎవరూ నోరు మెదపలేకపోతున్నారు..జీఎస్పై‌టి అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్... నాకు పన్ను కట్టడానికి మీరు సంపాదించండి అంటూ సింగిల్ లైన్ డైలాగులతో అల్లాడిస్తున్నాడు..దీంతో కాంగ్రెస్ వర్గాల్లో ఆహా మాబాబే... అంటూ సంబరపడుతున్నారు..ఐతే పాపం బిజెపి లీడర్లేమో  " ఆ...మీరూ జిఎస్‌టిని తీసుకురావాలని ట్రై చేశారు..మీరే గతమంతా పాలించారు" లాంటి స్టాక్ డైలాగులేసుకుంటూ కాలం గడుపుతున్నారు. అంతెందుకు పెద్ద కరెన్సీ నోట్ల రద్దు పై మౌనముని..నికమ్మాగా అద్వానీలాంటివారు వర్ణించిన మన్మోహన్ సింగ్ ఎప్పుడో తేల్చేశారు.. కనీసం జిడిపి 2శాతం తగ్గుతుంది..ఇది మంచిది కాదు అని చెప్పినా ఎవడూ పట్టించుకోలేదు..అదే ఇప్పుడు నిజమైంది...దానికి కొట్టొచ్చినట్లు కన్పించే  నిదర్శనంరీసెంట్‌గా బ్యాంకులకు ఊతం అంటూ ప్రకటించిన 2లక్షల11వేలకోట్ల ప్యాకేజీ..నిజంగా ఏ తప్పు జరగకపోతే..బ్యాంకులకు ఈ రేంజ్ సాయం ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది.
జిఎస్‌టి అంత గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అయితే ఎందుకు జనం గగ్గోలు పెడుతున్నారు...కేటగరీలుఎందుకు పదే పదే మార్చుతున్నారు..ఇవే రాహుల్ గాంధీ తన ట్విట్టర్లో పంచ్‌తో అడుగుతున్నాడు...
నువ్వోడిపోయావ్...నువ్వడగడానికి లేదు అనడం కాదు..కనీసం ఆయన మాట్లాడటం నేర్చుకుంటున్నాడని పంచ్ డైలాగులేసి సంబరపడటం కాదు..ఇదే ప్రశ్న జనం కూడా  అడుగుతున్నారు..ఎవరైనా సమాధానం చెప్తారా..అసలు డీమానిటైజేషన్ అనబడు ప్రక్రియ ఎవరు ఇనిషియేట్  చేశారు అంటే ఇంతవరకూ నేనూ అని చెప్పే దమ్మే లేదు..దాంతో వచ్చే మేళ్లు ఏంటో గాఠ్టిగా చెప్పే సత్తా లేదు...దీర్ఘకాలంలో , లాంగ్ రన్‌లో మంచి చేస్తుందంటూ...చెప్పుకోవడం తప్ప..అదెలా మేలు చేస్తుందో ఎన్డీఏ పెద్దలకి కూడా తెలీదా...! క్యూ లైన్లో నిలబడి 200మంది ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప..దీనివలన కలిగిన మేలు కానీ...అసలు వెనక్కి తిరిగిరాని ..(బ్లాక్ మనీ అని చెప్పుకుంటారు) డబ్బెంతో ఇంతవరకూ బైటికి చెప్పుకోలేని దుస్థితి ఏంటి మహానుభావా

...నువ్వే ఇంకో 50 ఏళ్లు పరిపాలించు...నువ్వే నీతివంతమైన పాలన అందించు...కానీ..జనాన్ని బతకనివ్వు..ఇదీ కామెంట్..అందుకే అడుగుతుంది రాహులా...చంద్రబాబా..జగన్...లోకేషా..కాదు...ప్రశ్నలోని పరమార్ధం గ్రహించు

Comments

  1. నవ్విన నాపచేనే పండుతుంది..

    ReplyDelete

Post a Comment