అమ్మపాలు ఇక అందరికీ అందుబాటులో

మాతృత్వపు మాధుర్యం, పితృత్వపు మమకారం అనుభవిస్తేనే కానీ తెలీవు..అందులో తల్లి అంటే దైవమే ఎందుకంటే మరో జీవికి జన్మనివ్వడం ఆమెకే సాధ్యం. ఐతే అలాంటి అమ్మలకూ కొన్ని ఇబ్బందులు తప్పవు..అవే తల్లిపాలు పడకపోవడం. ఇది ప్రకృతిసహజంగానే వచ్చే జబ్బుగా చెప్పొచ్చు..మరి అలాంటి తల్లిపాలుకు సాటిగా మరేవీ రావంటారు.ఐతే ఇలాంటి ఇబ్బందులకు కాస్త  విరుగుడుగా అమ్మపాల సెంటర్లు వస్తున్నాయంటే చాలారోజుల క్రితం పెద్ద వ్యతిరేకతే వచ్చింది..చివరికి తల్లిపాలు కూడా అమ్ముతారా అంటూ.!

ఐతే ఈ కాన్సెప్ట్‌లోని అసలు విషయం, లాభం తెలుసుకున్న తర్వాత ఇప్పుడంత నిరసనలు లేవు..అందుకే హైదరాబాద్‌లో మొదటి తల్లిపాల సెంటర్ నీలోఫర్ ఆస్పత్రిలో ప్రారంభమైంది.
కేంద్రమంత్రి అనుప్రియా పటేల్ ఈ  మిల్క్ బ్యాంక్ ప్రారంభించారు. ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ ఇక్కడి సెంటర్‌లో పాలు సరఫరా చేస్తారు.దీనికో బ్రాండ్ కూడా ఉంది..MAA అంటే  మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్..తల్లిప్రేమంత సురక్షితమనే అర్ధం వస్తుంది..తల్లిపాలు లేక చనిపోతోన్న శిశువుల సంఖ్యలో ఇండియాదే అగ్రభాగమట..ఆ మరణాలనుకాస్తైనా ఈ మా కార్యక్రమం ఆపితే చాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసమే ప్రతి రాష్ట్రంతో ఒప్పందాలు కుదుర్చుకుని మదర్ మిల్క్ సెంటర్లు ప్రారంభించేందుకు  ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

Comments