3 రూపాయలు పెట్టుబడి..ఇప్పుడు రూ.1600 అయింది


పదేళ్లు జీవితంలో చాలా ముఖ్యమైనవే..అందులో స్టాక్‌మార్కెట్ల సంగతిలో ఇది మరీ ప్రాముఖ్యం..మదర్ ఆఫ్ ఆల్ బుల్‌ రన్స్‌గా భావిస్తోన్న ప్రస్తుత ట్రెండ్‍లో పదేళ్లు సంగతెందుకు కానీ..ఒక్క ఏడాదికాలంలోనే షేరు వేల్యూ ఏకంగా 400శాతం,500శాతం పెరుగుతోన్న దాఖలాలు ఉన్నాయ్ ఐతే వేలకి వేలశాతాలు పెరగడం అంటే మాత్రం దీర్ఘకాలం ఆగాల్సిందే. అలా గత పదేళ్లలో ఓ కంపెనీ షేరు వేల్యూ 43000శాతం పెరిగింది. ఇంకా పెరుగుతోంది
లాభాలు పంచుతోంది చల్లచల్లగా..!    అదే సింఫనీ...!

పదేళ్ల కాలాన్ని లెక్కేసుకుంటే సెన్సెక్స్ 73శాతం మాత్రమే పెరిగింది. ఐతే సింఫనీ లాభాలకు మాత్రం ఆకాశమే హద్దు అన్నట్లుగా షేరు పెరుగుతూ వచ్చింది.ఎప్పటికప్పుడు మారుతోన్న ట్రెండ్స్‌కి అనుగుణంగా తమ రెవెన్యూ మోడల్ మార్చుకుంటూ సింఫనీ ఈ ఘనత సాధించింది. పదేళ్లక్రితం అంటే నవంబర్ 20, 2007లో సింఫనీ షేరు ధర రూ.3.64పైసలు మాత్రమే! ఇప్పుడు చూస్తే రూ.1567రూపాయలు.ఇలాంటి షేర్లనే చూస్తే..అవంతి ఫీడ్స్, కేప్లిన్ పాయింట్, అజంతా ఫార్మా, వక్రంజీ సాఫ్ట్, రిలాక్సో ఫుట్‌వేర్, ఐషర్ మోటర్స్, సోమనీ సిరామిక్స్ కూడా 5000శాతం నుంచి 30000శాతం వరకూ పెరిగాయి. కేవలం ఎయిర్ కూలర్ రంగంలోనే దృష్టి పెట్టడంతో సింఫనీ ఇదే రంగంలోని క్రాంప్టన్ గ్రీవ్స్,  ఉషా ఎయిర్కూలర్స్, పోలార్ కంపెనీలతో పోటీ పడుతూ వచ్చింది. 27 ఏళ్ల నుంచీ ఇదే సెగ్మెంట్లో వ్యాపారం చేస్తోన్న సింఫనీ ఆ తర్వాత కాలంలో ఏసీలు, వాషింగ్ మెషీన్లు సహా ఇతర కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అమ్మడం ప్రారంభించింది.ఐతే ఇవేవీ ఆ సంస్థకి కలిసిరాలేదు..ఒక్క ఎయిర్ కూలర్ల వ్యాపారం మాత్రం భేషుగ్గా సాగింది.2001కి వచ్చేసరికి ఇన్వెస్టర్లకి ఈ కంపెనీపై నమ్మకం పోయింది. ఆస్తులన్నీ కరిగి చివరికి పెన్నీ స్టాక్‌గా మిగిలింది. అప్పుడు ఇండస్ట్రియల్ అండ్ పైనాన్షియల్ రీకనస్ట్రక్షన్ బోర్డుకు సంస్థని రిఫర్ చేశారు కూడా..అప్పటి అప్పు రూ.50కోట్లు

2005లో  సింఫనీ తన వ్యాపారాన్ని పునర్జీవం చేయగలిగింది. వన్ ప్రొడక్ట్-మెనీ మార్కెట్స్ అనే కాన్సెప్ట్‌తో అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించింది. నార్త్ అమెరికాకి సంబంధించిన ఇంప్కో(Impco)ని 2009లో కొనుగోలు చేసింది. అలా తన వ్యాపారం పెంచుకుంటూ..2011 సంవత్సరంలో సెంట్రల్ ఎయిర్ కూలింగ్ సొల్యూషన్స్‌ ప్రొడక్ట్స్ అమ్మడం ప్రారంభించింది
" గత పదేళ్లకాలంలో సింఫనీ కొత్త రకాల ఉత్పత్తులను తయారు చేయడంలో..గ్రోత్ ఉన్న చోట అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆరితేరింది. అలా ప్రమోటర్లకు ఆస్తులు పెంచడమే కాకుండా షేర్ హోల్డర్లకి కూడా లాభం పంచగలిగింది" అని సంస్థ చరిత్రని పరిశీలించిన అనలిస్టులు చెప్తారు.
దేశీయ ఎయిర్ కూలర్ల మార్కెట్‌లో 63శాతం వాటా లోకల్ కంపెనీలదే. బ్రాండెడ్ ఎయిర్ కూలర్ల ఇండస్ట్రీలో కేవలం 5 కంపెనీలే అగ్రస్థానంలో 
కొనసాగుతున్నాయ్. వాటిలో సింఫనీదే టాప్ ర్యాంక్. దేశంలోని పాతికకోట్ల ఇళ్లలో దాదాపు 3 కోట్లమందికి మాత్రమే ఎయిర్ కూలర్లు ఉన్నాయ్. అంటే ఇంకా ఈ రంగంలో ఎంత గ్రోత్ ఉందో అర్దం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఉన్న 11శాతం మార్కెట్ షేర్‌ని 25శాతానికి పెంచుకునేందుకు సింఫనీ టార్గెట్ పెట్టుకుంది. ఇది కూడా 2026నాటికి. ప్రతి ఏటా పెరుగుతున్న టెంపరేచర్‌ని దృష్టిలో పెట్టుకుంటే ఏసీలు,.ఎయిర్ కూలర్ల వ్యాపారం బానే ఉంటుందనడంలో సందేహం లేదు



Comments