జగన్..అసెంబ్లీకి రాకపోయినా...ఇదే రీసౌండ్ సభలో


ఏం చేసినా టిడిపికే సాధ్యం..అది సభలో ఉన్నప్పుడు "అధ్యక్షా ఇలాంటి దుర్మార్గపు ప్రతిపక్షనేత ఉండటం మన దురదృష్టం అధ్యక్షా..ఇలాంటి అప్పోజిషన్ నేత ఉండకూడదు..శాడిస్ట్ "అంటూ విమర్శలకు దిగినా..ప్రతిపక్షానికి బాధ్యత లేదు సభకి రాకపోవడమేంటని వాపోయినా..అది తెలుగుదేశం లీడర్లకే చెల్లింది..ఇంతా చేసి ఇవాళ సభలో
అధికారపక్షం చాలా సజావుగా చర్చ జరిగిందని..దీనికి కారణం విపక్షం లేకపోవడమే అంటూ సన్నాయి రాగాలు ఆలపించింది..దీన్ని బట్టి సభ ఎలా ఉండాలనేది టిడిపికి ఓ క్లారిటీ ఉన్నట్లు తెలిసిపోయింది

మరి ఈ మాత్రానికి జగన్ సభని అగౌరవ పరిచారంటే రొడ్డకొట్టుడు డైలాగులెందుకు..పైగా సభలో రోజంతా సెల్ఫ్ డబ్బా తప్ప ఇంకోటేమైనా ఉందా..! ఎన్నిసార్లు చెప్పిందీ మళ్లీ పట్టిసం ప్రజెంటేషన్ ఒకటి..ఇంకా నదుల అనుసంధానం చేస్తాం. జగన్ అడ్డుకుంటున్నాడు..అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయ్ అంటూ ప్రగల్భాలు పలకడం ఎబ్బెట్టుగా అన్పించింది. ఎందుకంటే ఇది విన్నవారికే కేవలం టిడిపివల్లనే వర్షాలు పడినట్లు..ఆ విషయాన్ని కూడా ఎవరూ ఒప్పుకోనట్లు అన్పిస్తోంది

ఇక సభ క్లోజైన తర్వాత సిఎం జగన్ ఆస్తులు స్వాధీనం చేసుకోవడం కుదరదని చెప్పడం ఏంటో మరి..అక్కడికి ఆయన ఆస్తులు అంతా అటాచ్ చేయమని డిమాండ్ చేసినట్లు..దానికి చంద్రబాబుగారు సంయమనం పాటించిటనట్లు అర్థం చేసుకోవాలమో

Comments