అటు పాదయాత్ర...ఇటు విలువలకు పాతర


వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్రకి సిధ్దమవుతోన్న సమయంలో ఓ ఎమ్మెల్యే టిడిపిలోకి జంప్ అయ్యారు
పైకి ఏదైనా చెప్పనీ..జరుగుతోంది మాత్రం విలువలకి పాతరేసి మరీ అభివృధ్ది సాధిస్తున్నారు ఎమ్మెల్యేలు.

పార్టీలు మారుతున్న సమయంలో వీళ్లు చెప్తోన్న మాటలకు అసలు జనం విలువ ఇస్తారా అనేది కూడా వారికి పట్టదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంటే డెవలప్‌మెంట్ ఉండదు  అనుకున్నప్పుడు ఇన్నాళ్లూ ఆగక్కర్లేదు. మొత్తానికి మొత్తం ఎమ్మెల్యేలు టిడిపిలోకి కలిసిపోతే బెటర్..అప్పుడు అసెంబ్లీ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేసుకుంటూ బోలెడంత జనం డబ్బు ఆదా చేయవచ్చు.
ఇంతమంది ఎమ్మెల్యేలు అభివృధ్ది కాముకులైనప్పుడు..జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడం దండగ..హ్యాపీగా
అందరికీ పచ్చ కండువాలు కప్పేస్తే సరి..ఐతే చేయాల్సిన పని చేయకుండా రాజ్యాంగ బద్ద పదవి..నన్నెవడు ఏమీ అ
అనకూడదు..బొక్కలో తోయిస్తాం అంటూ కొంతమంది పెద్ద పదవుల్లో ఉన్నవాళ్లు దద్దమ్మల్లా చూస్తుండిపోవడమే దారుణం. నీతి, విలువల గురించి ఇలాంటోళ్లు లెక్చర్లివ్వడం శుధ్ద దండగ..పైగా పార్టీ మారినవాళ్లని అసెంబ్లీలో ఏమైనా టిడిపి  ఎమ్మెల్యేలుగా చెప్తున్నారా అంటే అదీ లేదు..మొత్తం ఇప్పటికీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 63 మంది ఉన్నారంటూ సైనిడై..అంటూ రొటీన్ డైలాగులతో అసెంబ్లీని వాయిదా వేయడం అందరికీ గుర్తే..! మరి ఇది విలువలకు పాతర వేయడం కాదా..!


సదరు పార్టీ మారిన తాజా జంప్ జిలానీ..ఈ మధ్య కాలంలోనే టిడిపి వాళ్లు రూ.20కోట్లు ఆఫర్ చేస్తున్నారని..ఆరోపించింది..అంటే అప్పట్లో డీల్ కుదరలేదు..ఇప్పుడు డీల్ సెట్ అయిందా..నువ్ కూడా రేవంత్ రెడ్డిలా శిల్పా మోహన్ రెడ్డిలా పదవికి రాజీనామా చేయ్..ఆమోదించడం ఆమోదించకపోవడం తర్వాతి సంగతి..కనీసం తర్వాత ఎన్నికల్లో చెప్పుకోవడానికైనా ఉంటుంది..అబ్బే..ఇలాంటివి పాటిస్తే లైడర్లు..సారీ లీడర్లు ఎఁదుకు అవుతారు..


Comments