గిడ్డి ఈశ్వరి బుక్ అయినట్లేనా.. ఈ వీడియో ఏం చెప్తోందో చూడండి


పాతికకోట్లకి డీల్ కుదిరింది. అవునా ఐతే ప్రూవ్ చేయండి ఇలాంటి సవాళ్లకి ఇప్పుడో ఆటవిడుపు వీడియో దొరికింది. గిడ్డి ఈశ్వరి తనకి ఎలాంటి ఆఫర్లు టిడిపివాళ్లు ఇస్తున్నారో చెప్తోందంటూ ఓ వీడియో సర్క్యులేట్ అవుతోంది.  పార్టీ నుంచి జంప్ కొట్టేముందు కార్యకర్తలు ఆమెని బతిమాలాడుతున్నట్లు ..దానికి ఆమె లేదు లేదు..ఎస్టీ కార్పొరేషన్ పదవి లేదంటే మంత్రి పదవి వస్తుంది అఁదుకే వెళ్తున్నా అంటున్నట్లు వీడియోలో కన్పిస్తోంది

ఈ ఎపిసోడ్‌ అంతా ఓ కుర్రోడు వీడియో తీసినట్లు సాక్షి చెప్తోంది..నిజంగా అది వీడియో అయినా కూడా ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే డబ్బులు ఇస్తూ రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్ అయినా కూడా ఫోరెన్సిక్ నివేదిక అంటూ ఇప్పటిదాకా చేసిందేం లేదు. ఇంకోటి నిత్యానంద రంజిత వీడియోల్లో ఉన్నది వాళ్లిద్దరే అంటూ తేల్చడానికి ఏడేళ్లు పట్టింది. ఇక ఈ వీడియోకి స్పందన కాదు కానీ, గిడ్డి ఈశ్వరి మరోసారి చంద్రబాబుని ఇరకాటంలో పెట్టారు. పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేస్తా అనడం కలకలం రేపుతోంది. ఇక మరోవైపు అచ్చెనాయుడు కూడా లాబీల్లో పెచ్చరిల్లినట్లు సాక్షి చెప్తోంది..
 ఆ వీడియో మీరూ చూడండి

సో ముందే మేం చెప్పినట్లు గిడ్డి ఈశ్వరి వెళ్తోన్న పథం తప్పు..కేవలం ఆమె అభివృధ్దే తప్ప నియోజకవర్గ అభివృధ్ది కోసం కాదని అర్ధమైపోయింది కదా..ఇక ఈ వీడియోలో నేను లేను..నా మాటలు కాదు..మార్ఫింగ్ చేశారు..ఇవన్నీ నెక్ట్స్ విన్పించే మాటలు..బ ీరెడీ ఫర్ దెమ్

Comments