పుస్తకాల పురుగులే ఎక్కువ కాలం బతుకుతాయట


ఎవరైనా బాగా పుస్తకాలు చదువుతూ ఉంటే పుస్తకాల పురుగు రా బాబూ అనడం చాలా కామన్. వాళ్లలోకం వాళ్లదే కానీ, ఇంకోటి పట్టించుకోరనే కామెంట్లూ వింటుంటాం..ఐతే ఇప్పుడు అలాంటి బుక్‌వార్మ్స్‌కి మంచి న్యూస్ ఒకటి యాలే యూనివర్సిటీ చెప్తోంది. ఎవరైతే ఎక్కువగా బుక్స్ చదువుతూ ఉఁటారో వాళ్లకే లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుందని
తేల్చింది. దీనికి సదరు యూనివర్సిటీ చెప్పే కారణాలు ఏమిటంటే, చదవడమనే  పని ఎంతో ఏకాగ్రతతో కూడుకున్నదని చెప్తున్నారు. అలా అన్ని జ్ఞానేంద్రియాలు అలర్ట్‌గా ఉండటం వలన ఎంతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని..తద్వారా ఆయుఃప్రమాణాలు పెరుగుతాయని యూలే యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్లు చెప్తున్నారు

ఓ రైలు కానీ..బస్సు కానీ జర్నీల్లో  ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నా.. పుస్తకాలు చదువుకునేవారంటేనే ఎక్కువ గౌరవం ఇస్తుంటారు..నిజంగానే బుక్ లవర్స్ మేధోసంపత్తి ఉన్నవారుగా రీసెర్చ్ చెప్తోంది. ఈ రీసెర్చ్ 3700మందిని స్టడీ చేసిన తర్వాత ఈ విషయాలను నిర్ధారిస్తున్నట్లు యూనివర్సిటీ చెప్పింది. సో ఇకపైనైనా బుక్ రీడింగ్ అలవాటు చేసుకుంటే లాంగ్ లైఫ్ తెచ్చుకోవచ్చన్నమాట..
లాంగ్ లివ్ బుక్ రీడర్స్..!

Comments

  1. డిజిటల్ యుగంలో పుస్తక పఠనం వర్థిల్లాలి

    ReplyDelete

Post a Comment