ఐటీ కంపెనీ షేర్లు కొనాలనుకుంటే ఈ స్టోరీ చూసి కొనండి


ఐటీ కంపెనీల షేర్లు గత కొద్ది కాలంగా  డౌన్ ట్రెండ్‌లో వెళ్తోన్న సంగతి తెలిసిందే కదా..ఇప్పుడు వాటిపై మరింత ఒత్తిడి పడబోతోంది..ఒబామాకేర్ లో ఎన్‌రోల్ చేసుకుంటే..త్వరితగతిన లాభాలు ఆర్జించవచ్చనే ఆప్షన్ కూడా ఇప్పుడు మూసుకుపోనుందని ప్రచారం జరుగుతోంది..ఎందుకంటే ఒబామాకేర్‌కి బడ్జెట్ తగ్గించాలని ఇప్పటికే ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు..ఐతే ఇది గతంలో కంటే పెద్ద తేడా లేదని అక్కడి అనలిస్టులు చెప్తున్నారు..కానీ మన ఐటి కంపెనీలు కొన్ని ఒబామాకేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఆదాయం ఆర్జిస్తున్నాయ్.. తాజా పరిణామాలతో వాటికి కొంచెం నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువ


ఐతే అఫర్డబుల్ కేర్ యాక్ట్(ACC) ఇంకా పూర్తి స్థాయిలో మార్పులు చేయలేదు కాబట్టి ఎంత మేర నష్టం వాటిల్లుతుందనేది తెలీదు. 
విప్రో హెల్త్ కేర్ ఆదాయంలో 15శాతం ఇలా ఒబామాకేర్ ద్వారా వస్తోంది. $120మిలియన్ డాలర్ల ఆదాయం నష్టపోవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. యాసెంచుర్ (Accenture) కూడా తమ ఆదాయం తగ్గిపోవచ్చని ఆందోళన చెందుతోంది. ఒబామాకేర్ లో ఎన్ రోల్ మెంట్ గతంలో చాలా గడువు ఉండగా..ఇప్పుడు 45రోజులకే పరిమితం చేశారు. వచ్చే ఏడాది నవంబర్ 1 నుంచి ఎన్‌రోల్ మెంట్స్ ఉంటాయని తెలుస్తోంది..
సబ్సిడీలు తగ్గించడం, ఎన్‌రోల్‌మెంట్ పీరియడ్ తగ్గించడం, కొన్ని సబ్సిడీలు ఎత్తేయడం. పబ్లిసిటీ కోసం నిిధుల్లో కోత..ఇలాంటి చర్యలన్నీ ఇండియన్ ఐటీ కంపెనీలతో పాటు అక్కడి ఇతర కంపెనీల ఆదాయంపైనా తీవ్రంగా ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. 

హెల్త్‌కేర్ బిజినెస్ సెగ్మెంట్ లో ఫార్మా/లైఫ్ సైన్సెస్, హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీస్ , హాస్పటల్  ఇలా మూడు కేటగరీలు కలిపి ఒబామాకేర్ నడుస్తోంది..పేయర్ కేటగరీనే ఒబామాకేర్ లో సందిగ్ధత వలన ఎక్కువ నష్టపోతున్నట్లుగా చెప్తున్నారు. డిసెంబర్ 15నాటికి ఎన్ రోల్ చేయించుకోకపోతే..2018 కవరేజీ లభించదని యూఎస్ అడ్మినిస్ట్రేషన్ క్లియర్‌గా నోటిఫికేషన్ విడుదల చేసింది..అంటే ఇప్పుడు తమ పేర్లు ఎన్‌రోల్ చేయించుకోని కంపెనీలు ప్రభుత్వం నుంచి పథకాలు పొందే వీలు లేదు.. ఐతే సబ్సిడీలు ఇస్తారో లేదో తెలీని పరిస్థితిలో ఎన్‌రోల్ చేయించుకుంటే లాభాల్లో కోత పడుతుందని కంపెనీలు వెనుకా ముందూ ఆడుతున్నాయ్..మరి ఈ దశలో మన ఐటీకంపెనీల షేర్లు కొనడం మంచిదో కాదో మీరే తేల్చుకోండి

Comments