అయ్యయ్యో..గిడ్డి ఈశ్వరి కూడా జంప్..కానీ జగన్ ‌పార్టీదే గెలుపట


" నా ప్రాణం ఉన్నంతవరకూ జగన్‌తోనే..వైఎస్సార్ కాంగ్రెస్ వీడేది లేదు..జగన్ అన్నే నా ప్రాణం, జీవితాంతం జగన్ వెంటే"
ఈ మాటలు ఎవరైనా అంటున్నారంటే ఇకపై వాళ్లు కూడా పక్క చూపులు చూస్తున్నట్లే అర్ధం చేసుకోవచ్చు..కావాలంటే కన్ఫామ్ చేసుకోవచ్చు..ఎందుకంటే పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ మారిన తీరు ఇదే అర్ధం వచ్చేలా చేస్తోంది..ఐతే ఇక్కడ ఇంకోవిషయం పాపం చంద్రబాబుకి ఝలక్ ఇచ్చినట్లే అనుకోవాలో...లేక టంగ్ స్లిప్పైందో తెలీదుకానీ..." రాష్ట్రమంతా సంగతి తెలియదు కానీ పాడేరులో మాత్రం ఖచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నే గెలుస్తుంది" అని గిడ్డి ఈశ్వరి ప్రవచించడం భలే కామెడీ  పంచుతోంది. ఈమె ఆ మాట అంటున్నప్పుడు వెనక ఉన్న టిడిపి లీడర్ ఒకాయన నోరు ఏ రేంజ్‌లో తెరిచారో చూస్తే...ఎందుకీ అభాసుపాలవడాలు అన్పించకమానదు..
(వీడియో క్రెడిట్స్ AP24x7 న్యూస్ ఛానల్)

ఈ 18నెలల్లో ఏం డెవలప్ అవుతుందో ఏమో కానీ.. మొదటిరోజే ఇలాంటి కామెంట్లు చేయడం తప్పకుండా...చంద్రబాబు ఐతే బాగా ఆగ్రహం..లేదంటే హాస్యం పుట్టించకమానదు..ఈ విషయాన్ని లైట్‌గా తీసుకుంటే అంతే కానీ,   ఈమె పార్టీ మారడానికి చెప్పిన కారణాలు చూస్తే...ఒకటి జగన్ వేరేవారిని పార్టీలోకి తీసుకోవడం...రెండు తన సీటు వేరేవారికి ఇస్తాననడం..ఈ రెండూ పాలిటిక్స్‌లో ఏదో పెద్ద అన్యాయం చేసినట్లు ఎవరూ అనుకోరు.ఎందుకంటే సాక్షాత్తూ చంద్రబాబుగారే జంపింగ్ జిలానీలకు కండువాల కప్పుతున్నప్పుడు జగన్ మాత్రం వేరేవారిని తీసుకోవద్దా...ఇక రెండోది..ఏ పార్టీ గెలుపు గుర్రం ఏదో  అది ఆ పార్టీ అధినేత ఇష్టాన్ని బట్టే  ఉంటుంది..

జగన్ పై ఎంతో ప్రేమ ఉంది..కానీ ఆయన నన్ను గెంటేశాడు అని వగచడంలో అర్ధం లేదు..ఎందుకంటే పాడేరులో నీ టిక్కెట్ కన్ఫామ్‌గా టిడిపి ఇస్తుందా..పైగా బాక్సైట్ తవ్వకాల విషయంలో బాబు తలనైనా నరుకుతామంటూ చేసిన కామెంట్స్ గుర్తుచేసుకుంటే..రాజకీయాల్లో ఎలా మాట్లాడినా కండువాలు మార్చితే సరిపోతుందనడంలో సందేహం లేదు.

ఐనా ఎన్నికలు 18నెలల తర్వాత కదా..అప్పుడే జగన్ అభ్యర్ధిని ప్రకటించేస్తే..అప్పుడు బైటపడాల్సిన సందర్భం..ఐనా ఈశ్వరి కి రావాల్సిన సిగ్నల్స్ వచ్చాయంటున్నారు..సో ఆమె వైపు తప్పులేదు..ఇక జగన్ వైపు తప్పు..ఇలా ఎమ్మెల్యేలు జారిపోతుంటే పట్టించుకోరని..పాదయాత్రలో ఉన్న వ్యక్తి..ఈ ఇష్యులపై స్పందించడంఅంటూ ఉంటే..సంతలో బర్రెల్లా కొంటున్నారని ఇప్పటికే చెలరేగుతున్న జగన్‌కి ఇదో కలిసి వచ్చే పరిణామమే..! ఓ వేళ ముందుగా అభ్యర్ధులను ప్రకటించడం జరిగితే..అది ఇలాంటి పరిణామాలకే దారి తీస్తుంది..మరి విజయసాయిరెడ్డి, జగన్ లెక్కలు వాళ్లకే తెలుసేమే అనుకోవాలి

Comments