హోటల్స్‌లో తినబోతున్నారా..! ఈ నంబర్లు గుర్తు పెట్టుకోండి


జిఎస్‌టి వచ్చిన తర్వాత ఎక్కడైనా..ఏ వస్తువైనా జిఎస్టీ అంటూ మన జేబుకే చిల్లు పెడుతుండటం గమనించాం కదా..ఇప్పుడు హోటల్ విషయమే తీసుకుందాం..తినే తిండికి...తాగే వాటర్ బాటిల్‌కి కూడా  జిఎస్‌టీ వేస్తున్నారు సార్ అంటూ బిల్ వేయడం దానిపై చిర్రుబుర్రులాడుతూ కట్టడం ఇకపై కుదరదు..ఎందుకంటే కనీసం సర్వీస్ ట్యాక్స్ కూడా కట్టాల్సిన పని లేదని..హైదరాబాద్ సివిల్ సప్లైస్ కమిషనర్ ఆనంద్ భరోసా ఇచ్చేశారు..
ఈయన గతంలో ట్రాఫిక్ వింగ్‌లో చేసినప్పుడు మంచి పేరు తెచ్చుకున్నారు..ఇప్పుడు వరసగా బిగ్‌బజార్, డి-మార్ట్ లాంటి పెద్ద పెద్ద మాల్స్‌ పై కూడా రెయిడింగ్స్ చేసి కేసులు పెట్టారు. ఆయనే స్వయంగా హోటల్స్ లో బిల్ లో సర్వీస్ ట్యాక్స్ అనేది నేరం..అది కట్టేవాడి ఇష్టాన్ని బట్టి ఉంటుంది కానీ..ఎవరూ కట్టాల్సిన అవసరం లేదని చెప్పారు


           ఓ వేళ బలవంతం చేసి కట్టిస్తే..ఇదిగో  ఈ నంబర్లకి కాల్ చేయండి  లేదంటే వాట్సాప్ చేయండి
                                                           7330774444,9490165619
ఈ రెండు నంబర్లూ సివిల్ సప్లైస్ శాఖ, లీగల్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్‌వి.
నిజంగా ఆనంద్ చెప్పినట్లే సర్వీస్ ట్యాక్స్ కట్టాల్సిన బాధ నుంచి తప్పించుకున్నట్లైతే..ఇక బయట టిఫిన్లు..భోజనాలు చేసేవాళ్లు కాస్త తెరిపిన పడ్డట్లే..! ఐతే ఇలా పెట్టే కేసులు వినియోగదారుల ఫోరమ్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడమే కాస్త ఇబ్బంది కలిగించే విషయం. ఎందుకంటే ఈ కోర్టుతీర్పులను మొండిబండరాతి చిప్పలు ఎంతవరకూ ఖాతరు చేస్తాయనేదే ప్రశ్న..ఎలాగైతేనేం ఓ ప్రయత్నం అంటూ చేస్తున్నారు కాబట్టి స్వాగతించాల్సిందే


Comments