లేకపోయినా ఉన్నట్లే..! వీళ్లు ఉన్నా లేనట్లే! ఏపీ అసెంబ్లీ సీన్


ఏపీ అసెంబ్లీ బాయ్‌కాట్ చేసి జగన్ నేషనల్ మీడియా అటెన్షన్ పొందారట..ఇది టిడిపి ఎమ్మెల్యేలే లాబీల్లో చర్చించుకుంటున్నారట. ఇదీ ఓ ఇంగ్లీష్ డైలీ కథనం. దాని ప్రకారం అసెంబ్లీలో క్వశ్చెన్ అవర్ ఎంటరవగానే ప్రభుత్వపక్షానికి ఏం చేయాలో పాలుపోవడం లేదని..ఏ ప్రశ్న ఎలా రైజ్ చేయాలో అర్ధం కాక కన్ఫ్యూజన్ అవుతున్నట్లు మాట్లాడుకుంటున్నారట.  ఆయుధాలు పట్టుకుని యుధ్దరంగంలోకి ఎంటరైన తర్వాత ఎవరితో పోరాడాలో తెలీని సిచ్యుయేషన్‌లా మా పరిస్థితి ఉందంటూ టిడిపి ఎమ్మెల్యేలు చెప్తున్నారని టాక్.
వైఎస్సార్సీపీ లీడర్ జగన్‌తో  డిఫర్ అవ్వొచ్చు కానీ..ఆయన వేసిన ప్లాన్‌ని మాత్రం ఎదుర్కోలేకపోయాం  ఎందుకంటే..బైట ఉన్నా వారి గురించే మాట్లాడాల్సి వచ్చింది. ఇక సభలో లేకపోయినా వారు ఉన్నట్లే అన్పిస్తోంది అని టిడిపి లీడర్ల ఒపీనియన్.

ఎమ్మెల్యేలను అంటే పార్టీలో చేర్చుకున్నారు కానీ...వారు ఇంకా వైఎస్సార్సీపీ వైపు ఉండే సీట్లలోనే కూర్చుంటున్నారు. అంటే విపక్షం ఉన్నట్లే భావించాలి..కానీ వాళ్లనుంచి ఎలాంటి ప్రశ్నలూ లేవు కాబట్టి..వాళ్లంతా ఉన్నా లేనట్లే భావించాల్సి వస్తుంది..మరోవైపు మంత్రులుగా ప్రమాణస్వీకారాలు చేసినవాళ్లు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులుగా స్పీకర్ ప్రకటించడం మరో విడ్డూరం..ఇది చాలు డెమోక్రసీ అంటే కామెడీగా అర్ధం చేసుకోవడానికి..ఆల్రెడీ వాళ్లపై యాక్షన్ తీసుకోమని కంప్లైంట్లు ఉన్నాయ్. యాక్షన్ తీసుకోవాల్సిన వ్యక్తి కోర్టు చెప్పాలి అంటాడు..కోర్టు అది మా పరిధిలోనిది కాదని..ఇప్పటికే చాలా కేసుల్లో చెప్పింది..అంటే తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతీ అనుకోవాలా..!


Comments