Hepeating, Maninterupting, Amplification..మగాళ్లూ హిపీటింగ్, మాన్‌ఇంటరప్టింగ్ ఈ పదాలెక్కడైనా విన్నారా!


ఎస్..ఇవాళ ఓ డైలీ న్యూస్ పేపర్‌లో సైకాలజిస్ట్ ఓ లేడీ ప్రశ్నకి సమాధానంగా ఈ పదాలు పరిచయం చేసింది..ఇది దేశం ఆ మాటకి వస్తే ప్రపంచం అంతా ఈ సమస్య ఉన్నదే! అదే వర్క్ ఎన్విరాన్‌మెంట్‌లో( ఆఫీస్) లేడీస్ ఏదైనా ప్లాన్ చెప్పబోయినా..అభిప్రాయం వ్యక్తీకరించినా..కొట్టి పారేయడం ఆ తర్వాత వాటినే తమ ప్లాన్లుగా చెప్పుకుని మెప్పులు సంపాదించడం..అంటే మన్మధుడు సినిమాలో  సోనాలిబెంద్రే ఐడియాని నాగ్ కాపీ కొట్టినట్లు..కాకపోతే అక్కడ సోనాలికి తెలీదు..ఇక్కడ హిపీటింగ్ అంటే..మీటింగ్స్‌లో లేడీ ఎంప్లాయీలు చెప్పేది వినకుండా కొట్టిపారేసి తర్వాత వాటిని ఓన్ చేసుకోవడం..క్రెడిట్ కొట్టేయడం..నిజమే కదా..జనరల్‌గా చేస్తూనే ఉంటారు..

ఇక మాన్ఇంటరప్టింగ్ అంటే అసలు అభిప్రాయాలు చెప్తుంటే..మధ్య మధ్యలో అడ్డుతగలడం లేదంటే పదేపదే
డిస్ట్రబ్ చేయడం....ఈ రెండు పదాల కష్టాలు.. ది  గ్రేట్ ఒబామా హయాంలో ఆయన ఆఫీస్‌లో లేడీస్ ఎదుర్కొన్నవేనట

మరి వీటికి విరుగుడుగా ఏం చేయాలి? అదే ఆంప్లిఫికేషన్(Amplification) అంటే ఇందాక చెప్పిన సమస్యలు
ఉన్నప్పుడు ఎవరైతే తమ ప్లాన్స్, ఒపీనియన్స్ చెప్తుంటారో వారిని మీటింగ్స్‌లో అభినందించడం..తర్వాత మాట్లాడుతున్నప్పుడు ఆమె అభిప్రాయాలను ప్రస్తావిస్తూ."ఎస్..ఇందాక చెప్పినట్లు...నేనూ ఆమె  ఒపీనియన్ ‌తో డిఫర్ అవుతున్నాననో..అగ్రీ అవుతున్నా అనో " చెప్పాలట..అలా చెప్పినప్పుడు ఇక సదరు మగానుభావుడు
చచ్చినట్లు వింటాడు లేదంటే వాటిని తన అభిప్రాయాలు..వ్యూహాలుగా చెప్పుకోలేడట..దీన్నే మైక్రో స్పాన్సర్‌షి్ప
అని కూడా అంటారట..ముందు కష్టంగా ఉన్నా..ఇవి రిజల్ట్స్ వచ్చేలానే ఉన్నాయ్..ఒక్క లేడీస్ అనే కాకుండా
సదరు మహిళల అభిప్రాయాలు నచ్చిన మగజంట్స్ కూడా ఈ పద్దతులు ఫాలో అవడం ఉత్తమోత్తమైన పద్దతి
అని నాకు అన్పిస్తోంది మరి!

Comments