సద్బుధ్దితో కూడిన దుర్భుద్దికరమైన సదుద్దేశమే-కడప..రామ్ గోపాల్ వర్మ హిలేరియస్ కామెడీ


ఇష్టం వచ్చినట్లు తీస్తున్నట్లు కన్పిస్తూ..అత్యద్భుతమైన చిత్రరాజాలు కావు నా సినిమాలు చూస్తే చూడండి లేకపోతే
లేదన్నట్లు వ్యవహరించే రామ్ గోపాల్ వర్మ ఈసారి మరో కలకలం రేపాడు..ఐతే ఈసారి సినిమా కాకుండా వెబ్ సిరీస్ తీస్తున్నట్లు చెప్పడంతో ఈ ఆసక్తి మరింత పెద్దదైన చిన్నది కానటువంటి ఓ పెద్ద చర్చ బయల్దేరింది.

కడప..రాయలసీమ రెడ్ల చరిత్ర దాని పేరు..ఈ టైటిల్ చాలు బోలెడంత పబ్లిసిటీకి..బోలెడన్ని కామెంట్లు రావడానికి..ఇక హిట్లు వ్యూస్ సంగతి చెప్పేదేముంది కనీసం లక్ష వీక్షణలకు తక్కువ ఉండదు. పైగా రాయలసీమ శరీరాన్ని బట్టలిప్పి చూపిస్తా అనడం ద్వారా మనోడు ఏ రేంజ్‌లో ఇందులో ఫ్యాక్షనిజం...నిజం తనదైన రామూఇజంతో చూపిస్తాడో తెలుసుకోవచ్చు.ఇప్పటికే గన్స్ అండ్ థైస్‌తో కిర్రెక్కిస్తోన్న వర్మ..ఈ కడపతో భయపెట్టేస్తాడేమో

పైగా ఇది డిసెంబర్ 15 అంటే..రేపే విడుదల కావడంతో ఇక ఫ్రీగా యూట్యూబ్ లో కావాల్సినంత మసాలా యాడ్ చేసుకోవచ్చు. పల్లీ బఠాని, ముంత మసాలా ఇలా..బోలెడంత కాలక్షేపం ..మే బి..ఛానళ్లలో బ్రేకింగులకు ఇక కొదవ ఉండకపోవచ్చు

Comments