ఇదీ రాహుల్ సత్తా..రాగా యుగం ముదలైనట్లేనా..కాంగ్రెస్‌తో శివసేన దోస్తీ


న్నికల ఫలితాలు ఎలా ఉన్నా గెలుపే మాట్లాడాలి..కానీ గుజరాత్ ఎన్నికల ఫలితాలు మాత్రం పరాజయం కూడా పాఠాలు నేర్పుతోంది. అటు బిజెపికి..ఇటు కాంగ్రెస్‌కి..ఐతే గెలిచిన పార్టీ కాబట్టి బిజెపి పెద్దగా ఏమీ నేర్చుకోదు..కానీ ప్రధానమంత్రి మోడీ మాత్రం బైటికి చెప్పకుండా  చాలా నేర్చుకుని ఉంటారు. ఆయన చెప్పిన మాటలను బట్టి మాత్రం పొలిటికల్ లీడర్లు విజయం కోసం ఏమైనా చేయొచ్చు ఏమైనా ప్రచారం చేయొచ్చని నేర్చుకుంటారు.ఇక ఆయన స్వయంగా నేర్చుకునేది మాత్రం..అడ్డదిడ్డంగా నిర్ణయాలు తీసుకుంటే భజన చేసేవాళ్లు ఆహా ఓహో అనవచ్చు కానీ..జనం సైలెంట్‌గానే  తమ తీర్పు ఇస్తారని..తమని అంత చులకనగా చూడొద్దని ఓ సంకేతం ఇచ్చారని చెప్పొచ్చు

ఓ ప్రధానమంత్రి తనని మర్డర్ చేయడానికి మాజీ ప్రధానమంత్రి సుపారీ ఇచ్చారని ఆరోపించడం భారతదేశంలోనే మొదటిసారి. అందుకే ఆ ఫలితం కూడా చవి చూడాల్సి వచ్చింది. ఇలాంటి దరిద్రపు గొట్టు ఆరోపణలు చేసినంత మాత్రాన అవతలి వ్యక్తులు ప్రతిష్ట ఏ మాత్రం దెబ్బతినదు సరికదా..మన స్థాయి ఏంటనేది మనమే బైటపెట్టుకున్నట్లు అయింది.. ఇక రాహుల్ గాంధీ వరకు చూస్తే ఆయనలోని ఫైటర్ బైటికి వచ్చినట్లే..వ్యూహాల పరంగా గొప్పగా పని చేయకపోయినా, భవిష్యత్తులో తన సామర్ధ్యం విస్తరించడానికి ఇదో లిట్మస్ టెస్ట్..


ఎన్నికల ఫలితాలకు ముందునుంచీ రాహుల్‌ని పొగిడేస్తోన్న శివసేన ఇప్పుడూ అదే పని చేస్తోంది..ఇది ఉత్తరభారతదేశంలో పొడుస్తోన్న మైత్రిని గమనించాల్సిందే. ఖచ్చితంగా ఇది రానున్న రోజుల్లో మోడీ వ్యతిరేక కూటమి బలంగా ఉండబోతోందనే సంకేతమే. గెలిచాం కాబట్టి రఘునందన్ రావ్, విద్యాసాగర్ లాంటి ఫాలోయర్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసుకుంటూ పోతే చివరికి చేతికి చిప్పే మిగలకతప్పదు. ఎక్కడిదాకో ఎందుకు కర్నాటక, ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలే ఇక పార్లమెంట్ ఎన్నికలను శాసించబోతున్నాయనేది ఖచ్చితంగా అర్ధం చేసుకోవాలి..సో రాగా వర్సెస్ మోడీ పోరులో ఓడిపోయినంత మాత్రాన రాహుల్ గాంధీ సత్తాని తక్కువ చూడరాదనే ఈ ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయ్

Comments