వెదురు బొంగే..ఇకపై చెట్టుకాదు..ఎక్కడైనా నరుక్కొవచ్చు


వెదురుచెట్లు ఎక్కడబడితే అక్కడ  ఒక పంటలాగా సేద్యం చేయడమనేది కన్పించదు. ఐతే ఇవాళ పార్లమెంట్‌ల ొ చేసిన చట్టం ఆధారంగా ఇక ఎక్కడైనా ఈ చెట్లను యధేచ్చగా నరుకుకొవచ్చు. ఇదివరలొ ఇలా చేయాలంటే అటవీశాఖ పర్మిషన్ ఇవ్వాలి. సాధారణంగా ఇదే కాదు ఏ చెట్టు కొట్టాలన్నా అక్కడి స్థానిక అధికారుల అనుమతులు తప్పనిసరి..వాల్టా చట్టం అనేది కూడా ఒకటుంది..ఐతే ఇలాంటి చట్టాలు ఎన్ని ఉన్నా జరగాల్సిన ఘొరాలు జరిగిపొతూనే ఉఁటాయ్. మనుషులు తప్ప చెట్లకి కూడా చట్టాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు
అందుకే ఇప్పుడు కేంద్రం హడావుడిగా తీసుకొచ్చిన ఈ చట్టంపై కూడా విమర్శలు ఉన్నాయ్.
కేంద్రం చెప్పడమేంటంటే,  ఇలా వెదురును చెట్ల జాబితానుంచి తొలగించడం ద్వారా ఆదివాసీలు,  కొండజాతులు, కొండ ప్రాంతాల్లొ నివసించేవాళ్లు హ్యాపీగా ఈ చెట్లను పెంచేసుకుని తర్వాత కొట్టేసుకుని బొలడెంత ఆదాయం సంపాదించుకొవచ్చునట

 1927 నాటి భారత అటవీశాఖ చట్టానికి సవరణ చేసి కేంద్రప్రభుత్వం ఇలా బాంబూని చెట్లజాబితానుంచి మినహాయింపు ఇచ్చింది. ఐతే ఇప్పటికే చెట్లుగా పరిగణిస్తున్న చొట, పెంచుతున్న చొట మాత్రం పాత చట్టాలు నిబంధనలు మాత్రం వర్తిస్తాయనడం తవ్వి తలకెత్తుకున్నట్లే ఉంది. కేంద్రమంత్రి హర్ష వర్ధన్ స్వయంగా ఈ విరుద్దమైన వాదన చేస్తున్నారు. 26 రాష్ట్ర్రాలకు ఇలా బొంగుని తొలగిస్తున్నామని అడగగా..24 రాష్ట్రాలు అంగీకరిస్తున్నామని చెప్పాయంటున్నారాయన. అసలు ఇంతకీ వీళ్లేమని పంపారొ..వాళ్లేమనుకుని ఒకే చెప్పారొ కూడా తెలియాలిగా..!
భూమ్మీద అత్యంత వేగంగా పెరిగే వెదురుతొ వైద్యపరంగా కూడా ఉపయొగాలున్నాయ్. ఎముకలు విరిగినప్పుడు వెదురుబొంగుల పుల్లలతొనే అటూ ఇటూ ఊతంగా పెట్టి కట్టు కడతారు ఇప్పటికీ..ఖచ్చితంగా ఎముకలు అతుక్కుంటాయి కూడా

వెదురు చెట్టు కాదు..బొంగే అని పర్మిషనివ్వడంతొ ఇక మన కలప దొంగలు ఊరకుంటారా..యధేచ్చగా నరుక్కుంటూ పొతారు. ఇది మడ ప్రాంతాల్లొ బాగా పర్యవరణానికి హాని కలిగిస్తుంది. అసలు ఇదివరకు తీరప్రాంతాల్లొ ఇలా వెదురుచెట్లు, సర్వీచెట్లు తెగ పెరిగేవి..ఇప్పుడు చూడాలన్నా కన్పించడం లేదు..సముద్రంనుంచి వచ్చే విషగాలులను ఆయా ప్రాంతాల్లొని గ్రామాలకు చేరనీయకుండా ఫిల్టర్ చేయడంలొ వీటిదే ముఖ్యపాత్ర. ఇప్పుడు వారికేదొ ఆదాయం తెచ్చిపెడుతున్నామనే ప్రచారహొరులొ భవిష్యత్తులొ ఎంత ప్రమాదం తెస్తుందొ కేంద్రం ఆలొచించండం లేదు..ఇదే విషయాన్ని కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయ్..ఐతేనేం రాజు తలచుకుంటే దెబ్బలేం కొదవ..అలా వెదురుపై బొంగు బ్యాంబూ పడిపొయింది

Comments