ఈసారి గాలిపటం ఎగరేసేముందు ఇది చూడు మోడీ


గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ప్రధానమంత్రి మోడీ భాషలో చెప్పాలంటే గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్..రాహుల్ గాంధీ ఎటకారం ఆడినట్లు చెప్తే గబ్బర్ సింగ్ ట్యాక్స్. ఇది ఓ గేమ్ ఛేంజర్‌గా భారతీయజనతాపార్టీ చెప్తూ వచ్చింది. ఎన్టీఏలోని మిగిలిన పార్టీలు ఏమని చెప్పాయో తెలీదు కానీ బిజెపి మాత్రం ఇది తీసుకురావాలనే చెప్పంది. గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు మోడీ ఏం చెప్పాడన్నది అప్రస్తుతం. కానీ నీిజంగానే ఇది వ్యాపారవర్గాల్లో ఏమో కానీ..భారతీయజనతాపార్టీ గేమ్ మాత్రం మార్చేసింది.
అటు గుజరాత్ ఎన్నికలలో బాగానే ప్రభావం చూపించింది. ఇటు మిగిలిన ప్రాంతాల్లోని జనం కూడా తాము చాలా మంది వ్యాపారాలు కోల్పోయామని చెప్పారు. ఇందుకు తగ్గట్లుగా కేంద్రం కూడా పన్నుల శ్లాబులు మార్చేసింది వీలైనంతగా తగ్గించామని చెప్పింది. ఐనా అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. పార్టికి డ్యామేజీ జరిగిన విషయం బిజెపి ఒప్పుకోలేదు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ ట్యాక్స్ ఫెయిలైందని చెప్తుున్నాయ్. రాహుల్ గాంధీ అధికారంలోకి రాగానే ఇవి మార్చుతామని చెప్పారు. అదెంతవరకూ జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే ఇప్పటిదాకా ఓ ప్రభుత్వం విధించిన పన్నులను మరో ప్రభుత్వం వచ్చి రద్దు చేసిన దాఖాలలు కన్పించడం లేదు

ఎక్కడిదాకో ఎందుకు ప్రధానమంత్రి మోడీనే సరదాగా బాగా పబ్లిసిటీకి పనికొచ్చే, మనసుకు ఉల్లాసమిచ్చే గాలిపటాల పండగకి స్వయంగా హాజరు అవుతారు. ఐతే ఈసారి మాత్రం అలా చాలా పతంగుల వ్యాపారులు తమ బిజినెస్ నష్టపోతోందని చెప్తున్నారు. దీనికి కారణం జిఎస్టీనేనట. అటు దారం ధర, ఇటు పతంగుల ధర అనివార్యంగా పెరగడంతో ఆ ప్రభావం తమ అమ్మకాలపై పడుతోందని చెప్తున్నారు వారు. ఇందుకు సంబంధించి ఏఎన్ఐ చేసిన ఓ స్టోరీ చూడండి ఈ కింది వీడియోలో

video credits to ANI

Comments