రాహుల్ రాటుదేలాడు


అరుణ్ జైట్లీని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా రఫ్పాడించేశాడు..అఫ్‌కోర్స్ అది ఆయన టీమ్ చేసి ఉండొచ్చు. లేక ఆయనే చేసి ఉండొచ్చు గానీ, జైట్లీని జైట్ లైగా..మోడీని చెప్పింది చేయనివారుగా, చేసేది చెప్పనివారుగా చక్కగా వర్ణించారా ట్వీట్‌లో

ప్రధానిపై సుపారీ  ఇచ్చారంటూ మన్మోహన్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై ఆరోపించిన విషయం గుర్తు చేసిన రాహుల్ అందుకు తగ్గ వీడియోని కూడా పోస్ట్ చేశారు. దానికి మోడీకానీ..ఇంకెేవరకూ కానీ క్షమాపణలు చెప్పలేదు కానీ..మణిశంకర్ అయ్యర్‌ ని తాము సస్పెండ్ చేసిన విషయం గుర్తుకుతెచ్చుకోవాలని రాహుల్ సెటైర్ వేశారు..


ఇప్పుడు మీడియాని చూసినా స్పష్టంగా ఓ మార్పు కన్పిస్తోంది..మోడీని మోసినన్నాళ్లూ మోసారు..బంపర్ మెజారిటీతో పగ్గం చేతికిచ్చేదాకా నానా ప్రయత్నాులు చేశారు. ఆ తర్వాత కూడా బాగానే మోసారు. కానీ ఇప్పుడా మోజు తీరినట్లుంది..ఇక రాహుల్ ని పల్లకీ ఎక్కించే ప్రయత్నాలు మీడియాలో ఓ వర్గం చేస్తుందేమో అన్పిస్తోంది. ఎఁదుకంటే గత నెలరోజులుగా రాహుల్ పై వెటకారపు కామెంట్లు, రాతలు తగ్గిపోయాయ్. ఇక ఈనాడు, రిపబ్లిక్ టివి లాంటివి వేరు వాటికి బిజెపి ఏం చేసినా సమ్మగా కమ్మగా ఉంటుంది కాబట్టి వారికెటూ రాహుల్‌కి మద్దతుగా రాయాలంటే చేతులు రావు. పైగా ఇప్పుడు బిజెపి చేసిన తప్పులు కళ్లముందు కన్పిస్తుండేసరికి చాలా మీడియాల్లో వాటిపై విమర్శలు చేయకపోయినా..మద్దతు మాత్రం పలికే పరిస్థితి లేదు
దీన్నే రాహుల్ టీమ్ చక్కగా క్యాష్ చేసుకుంటోంది.
https://twitter.com/OfficeOfRG/status/946038581306441728
https://twitter.com/twitter/statuses/946038581306441728

Comments