73 ఏళ్లుగా లేని కష్టం ఇప్పుడే వచ్చిందా


అవును..73 ఏళ్లుగా లేని కష్టం ఇప్పుడే వచ్చిందా అంటున్నాయ్ ప్రతిపక్ష పార్టీలు..జనంలొ కొంతమంది వాదన కూడా అదే. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికలు ఏడాది ముందే కాదంటే..మరొ 10 నెలలు ముందుగానే జరుపుకుని బరిలొ దిగాలని బిజెపి భావిస్తొందట. దీని కొసం రాష్ట్రపతి ప్రసంగంలొ కూడా ప్రస్తావన చేర్చారు. అంటే ఒక 14 రాష్ట్రాల ఎన్నికలను లొక్ సభ ఎన్నికలను ఒకేసారి జరిపితే బొలెడంత ఖర్చు తగ్గుతుందని పైకి చెప్పే మాట
కానీ అసలు ఇది  అమలు సాధ్యం కాదని..ఎందుకంటే ఒక రాష్ట్రంలొ అంటే సరే కానీ ఎకాఎకిన సగం దేశంలొ ఎన్నికలు ఒకేసారి జరిగినంత మాత్రాన ప్రతి రాష్ట్రంలొ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కాదు. లేదూ జంపింగ్ జిలానీలతొ ప్రభుత్వాలు కూలవచ్చు. అలాంటి సమయాల్లొ మరి అలాంటి రాష్ట్రాలు తిరిగి ఐదేళ్ల వరకూ అలానే ఉఁడాలా.,..లేక తిరిగి ఎన్నికలకు వెళ్లే పక్షంలొ ఏకసమయ ఎన్నికలనే కాన్సెప్ట్‌కి అర్ధం లేదు కదా..!

కేవలం తన ప్రాబల్యం ఇప్పుడైతే బావుందని..ఇంకొన్నాళ్లు ఆగితే ఈ ఊపు ఇంకా తగ్గొచ్చని మొడీ మహరాజ్ భావిస్తున్నారట. అఁదుకే వీలైనన్ని రాష్ట్రాల్లొ పాగా వేస్తే బలంగా పాతుకుపొవచ్చని ఈ ఎత్తుగడ వేస్తున్నారని విపక్షాల ప్రచారం..అసలు జమిలి ఎన్నికలు వేరు..ముందస్తు ఎన్నికలు వేరు. ఈ రెండింటినీ కలిపి చూడటంలొనే ఎన్‌డిేఏ పెద్దల లాఘవం కన్పిస్తొంది. ఎందుకంటే నిన్న జరిగిన గుజరాత్ ఎన్నికలు తిరిగి  ఐదేళ్లకి కానీ జరగవ్..అలాంటప్పుడు వచ్చే ఏడాది లొపు 14 రాష్ట్రాలు..ఆ తర్వాతి దఫా మొత్తం దేశం అనే ఊహ ఊహగానే మిగులుతుంది ఎందుకంటే గొవా, ఉత్తరాఖండ్, బిహార్ వంటి రాష్ట్రాల్లొ పొత్తులు ఎన్నికల తర్వాత ఖరారు చేసుకుంటున్నారు.. అలాంటప్పుడు మధ్యలొనే ఇలా ప్రభుత్వాలు మారుతుంటాయ్..మరి వాటికేదీ సవరణ కానీ..సమస్యా పూరణం కానీ చేయకుండా ఎకాఎకిన రాష్ట్రపతి ప్రసంగంలొ ఎలాంటి చర్చలూ..అభిప్రాయసేకరణలూ లేకుండానే పెట్టడం చూస్తుంటే విడ్డూరంగా అన్పించకమానదు మరి

Comments