దుమ్ముగూడెంలో అలా..మరి ఈ తాగుబోతులు ఎలా


భద్రాచలం జిల్లాలో ఓ మారు మూల గ్రామం. ఇప్పుడు మద్యం వద్దంటోంది. తాగినా..అమ్మినా 20వేల రూపాయలు జరిమానా వేస్తానని గ్రామ పంచాయితీ తీర్మానం చేసింది. మరి జనవరి 1, అంతకు ముందు రోజు రాత్రి ఎంత తాగారో పతాకశీర్షికలపై చూసారు కదా ఈ స్థాయి తాగుబొోతులు ఇలాంటి జరిమానాలు ఎలా లెక్క చేస్తారు


తమాషాకే అనుకోండి సీరియస్‌గానే అనుకోండి ప్రతి పార్టీ ఎన్నికలకు ముందు మద్యపాన నిషేదం విధిస్తాం..మందును నిరుత్సాహపరుస్తాం అంటారు నిజంగా ఇంత భారీగా పీపాలకొద్దీ తాగేస్తోన్న మందుబాబులు నిజంగా ప్రొహిబిషన్ పెడితే ఏమవుతారు. ఒకప్పుడు సిగరెట్లు  ఎక్కడబడితే అక్కడ తాగేవారు. కానీ ఓ దశ తర్వాత ఇది తక్కువ అయిపోయింది. కానీ ఇప్పుడు పల్లెటూళ్లలో తగ్గింది కానీ సిటీలోనే ప్రతి యెదవా చేతిలో ఓ సిగరెట్ పట్టుకుని..దాన్ని అలా అలవొకగా గాల్లోకి వదిలేస్తూ జనంపైకి పొగ వదలడం ఫ్యాషన్ అయిపోయింది. అసలు వీలైతే మీ పొగ మీరే పీల్చండి బైటికి వదలకండనే రోజులూ వస్తాయేమో ఎందుకంటే పర్యావరణం అంతగా పాడైపోయింది ఇది ఢిల్లీలో స్పష్టంగా కన్పిస్తూనే ఉంది. ఈ తరహా వాతావరణం అన్నిచోట్లా రావడానికి పెద్ద సమయం ఏం పట్టదు

మరి నడికుడు ఊరు చూస్తే మొత్తం కలిపి 5వేల మంది ఉంటారో లేదో కూడా తెలీదు అలాంటి గ్రామంలోనే 8 బెల్టు షాపులు ఉంటే ఇక అద్భుతమైన సమాజం ఎలా రూపుదిద్దుకుంటుంది. వాళ్లు తాగుతున్నారు కాబట్టి మేం అమ్ముతున్నామనే వితండ వాదన పక్కనబెడితే ఇలానే తీర్మానాలు చేస్తోన్న గ్రామాలు చాలానే ఉన్నాయ్. వాటికి కావాల్సిందల్లా ప్రభుత్వాల మద్దతు. కసి గట్టినట్లు..పగ బట్టినట్లు ఆ ఊళ్లపై షాపులను ఉసిగొల్పకుండా వారికి నైతిక మద్దతు కల్పిస్తే చాలు


Comments