ఇంతకీ రెజీనాని మోసం చేసిందెవరు?


రెజీనా కాసాండ్రా అన్నీ ఉన్నా చేరాల్సిన రేంజ్‌కి చేరలేదనే ఫీలింగ్ అందరికీ ఉంది. రాశీఖన్నా, లావణ్య త్రిపాఠితో పోల్చుకుంటే ఈ బ్యూటీకి ఛాన్సులు ఎక్కువే వచ్చాయ్. ఐనా కూడా ఎక్కడా ఓ వందరోజులు సినిమాలో పడింది లేదు. ఆమెతో పాటే ఎంట్రీ ఇచ్చిన రకుల్ ఫ్రీత్ సింగ్ రఫ్పాడించేస్తే..ఈ అమ్మడు మాత్రం సినిమా సినిమాకి డౌన్ అయిపోతూ ఉంది. ఇప్పుడా బ్యూటీ అందుకు రీజన్ చెప్పేసింది..ప్రేమలో పడటమే తన కెరీర్ ముందుకు సాగకపోవడానికి కారణమని ఓపెన్‌గా చెప్పేసింది. ఇకపై అలాంటి పని ఎప్పుడూ చేయనని చెప్పడం ఇప్పుడు అనేక పేర్లు తెరపైకి రావడానికి కారణమవుతోంది

ఎందుకంటే ఆమెగారు ఎంట్రీ ఇచ్చిన సమయం నుంచి అటు సందీప్ కిషన్..ఇటు సాయ్ధరమ్ తేజ్‌తో క్లోజ్‌గా మూవ్ అయిందని టాక్ వాళ్లిద్దరూ కూడా ఆమెతో ఫ్రెండ్షిప్పే తప్ప ఇంకే లిప్ లాక్ బంధం లేదని చెప్పుకొచ్చారు
మరి ఇప్పుడు ఆమె చెప్తోన్న హీరో ఎవరనేది జనానికి సస్పెన్స్‌గా ఉన్నా కూడా ఊహించుకోవడం పెద్ద కష్టమేం కాదు.తాజాగా ఆమె ఖాతాలో ' అ  ' సినిమా తప్ప పెద్దగా వేషాలేం లేవ్. ఇక తొందర్లోనే ఐటెమ్ సాంగ్స్ కూడా చేస్తుందేమో అన్పించకమానదు.చేస్తోన్న అ సినిమా కూడా హీరో నాని ప్రొడ్యూస్ చేస్తున్న సినిమానే..దీనికి కూడా ఆమె మెయిన్ టైన్ చేసే రిలేషన్స్ మాత్రమే కారణం తప్ప ఆమె నటనకి ఇచ్చినవి కాదని కొందరి ఫీలింగ్.

ముందు పుకార్లు రావడం కాదని కొట్టిపారేయడం ఆ తర్వాత కన్ఫామ్ చేయడం కామన్ అయిపోయిన ఇండస్ట్రీలో ఇప్పుడు రెజీనా లవ్ ఫెయిల్యూర్‌తో శృతిహసన్, సమంత, నమిత, త్రిష సరసన చేరిపోయినట్లనుకోవచ్చు. వీళ్లంతా కూడా తమ ఫస్ట్ లవ్ ఫెయిల్ అయిన తర్వాత ఓ రేంజ్‌లో ఇరగదీసినవాళ్లే మరిప్పుడు ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేక చార్మిలా తెరవెనుకకు వెళ్తుందో మరి

Comments