బొండా ఉమా..ఇదేం సమర్ధన


బెజవాడ సింగ్‌నగర్‌లో ఫ్రీడమ్ ఫైటర్ తాలుకూ భూమి కొట్టేద్దామనుకున్న కేసులో బొండా ఉమా భార్య ఇరుక్కోవడం రాష్ట్రంలో సంచలనమేమో కానీ..విజయవాడ వాసులకు పెద్దగా ఆసక్తి ఉన్నట్లేం లేదు. ఎందుకంటే గతంలోనూ ఇలాంటి సివిల్ కేసులు చాలానే వాళ్లపై ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయ్. ప్రజాప్రతినిధిగా  ఎన్నికైన తర్వాత ఇలాంటి గలీజు వ్యవహారాలుకు వీలైనంత దూరంగా( అంటే కన్పించకుండా) ఉంటారు. అందులోనూ ఇప్పుడు ప్రభుత్వ ప్రతినిధిగా ఎన్నికైన తర్వాత కూడా కేసుల్లో కుటుంబసభ్యులు ఇరుకున్నా..అది వాళ్లకీ చుట్టుకుంటుంది.

" కేసులు ఉన్నట్లు తెలీదు..తెలీగానే జిపిఎ రద్దు చేసుకున్నాం" లాంటి వ్యాఖ్యలతో విషయాన్ని చల్లబరిచే ప్రయత్నం 
బొండా ఉమా చేసినా అక్కడ కవరింగ్ సరిగా  లేదు. ఎందుకంటే గత ఏడాది ఈ విషయంపై కేసులు పెట్టినప్పుడు వెంటనే రద్దు చేసుకుంటే..ఈ వ్యవహారం ఎందుకు బైటికి వస్తుంది. అందులోనూ ఇప్పుడు కేసులో ఏ2 ముద్దాయే తనని చంపుతామంటూ బోండా  ఉమా అనుచరులు  బెదిరిస్తున్నారని ఓపెన్‌ స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడు. ఈ మాత్రం చాలదా ఇందులో ఎవరి హస్తం ఉందో తెలియడానికి..

ఈ మధ్యనే తమ ఆస్తులు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్రావ్ పై దంపతులు కేసు ఒకటి పెట్టిన నేపధ్యం గుర్తుండే ఉంటుంది. అలానే గుంటూరులో ఓ మహిళ తన కూతురు క్యాన్సర్‌తో చనిపోతుంటే పట్టించుకోలేదని బొండా ఉమా అనుచరుడిపై కేసు పెట్టిన ఉదంతం కూడా ఉంది. సదరు అనుచరుడి వెనుక  ఉమా ఉండబట్టే రెచ్చిపోయి దాడులు కూడా చేశారని ఆ మహిళ అప్పట్లో వాపోయింది. వరసబెట్టి టిడిపినేతల భాగోతం బైటపడుతుండటం ఆ పార్టీ తీరుకి నిదర్శనంగానే చూడాలి. ఐతే ఈసారి బొండా ఉమా అండ్ కో భాగోతం వెనుక ఆ పార్టీ నేతలే ఉప్పందించారని టాక్ నడుస్తోంది. తనకి ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ అప్పట్లో ఈయనగారు వీరంగం వేసిన సంగతి గుర్తుంచుకునే..ఇప్పుడిలా కేసులు బైటపెట్టారని ప్రచారం జరుగుతోంది..చూద్దాం ఇప్పటికైతే బొండా ఉమా ఇది తనపై రాజకీయకుట్రతో పెట్టిన కేసులంటున్నాడు..ఇలాంటివి ఇంకెన్ని బైటపడతాయో మరి

Comments