జగన్‌కి అది దూరమట! అసలు చింతమనేనికి టిక్కెట్ దొరుకుద్దా!?


చింతమనేని ప్రభాకర్ అంటే గత మూడేళ్లక్రితం వరకూ ఎవరికీ తెలిసేది కాదు.ఎప్పుడైతే కృష్ణా జిల్లాకి సంబంధించిన ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేశాడో ఇక అప్పట్నుంచీ మనోడి పేరు తెలీని రాజకీయపక్షులు లేకుండా పోయారు. మధ్యలో అసెంబ్లీలో జగన్‌పైన విమర్శలు చేయడం..దానికి జగన్ అసెంబ్లీ ప్రాంగణంలో దగ్గరకుపిలిచి మరీ వార్నింగ్ ఇవ్వడం కూడా అందరికీ గుర్తుండే ఉంటాయ్. ఇప్పుడదే చింతమనేని ఉన్నట్లుండి  పవన్ కల్యాణ్ ఫాన్ అయిపోయాడు. అటు  బిజెపి ఇటు టిడిపి నేతలు ఈ మధ్యకాలంలో బాగా డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేస్తుంటే..తన అధినేత తరపున తానే రంగంలోకి దిగాలనుకున్నాడో లేక ఎలాగైనా ఓ మిత్రుడు కావాలనుకున్నాడో కానీ..మా గెలుపుకి పవన్ కల్యాణ్ చాలా కారణమని చెప్పాడు..ఐతే ఇదే నోరు గతంలో ఎవడు వాడు..సొంత అన్ననే గెలిపించుకునేవాడు మమ్మల్ని గెలిపిస్తాడా...అంటూ కొన్ని నోటిదూల కామెంట్లు కూడా చేసిన హిస్టరీ మనోడికుంది

ఇది ఓ రకంగా బిజెపికి పరోక్షంగా చురకలు వేయడానికే అని కొంతమంది వాదన. ఎందుకంటే బిజెపి తమ అండ లేకుండానే పోటీలో నిలుస్తామని చెప్తోన్న తరుణంలో అసలు తమ రెండు పార్టీలకు పవన్ కల్యాణ్ జనసేనే సాయపడిందని చెప్పడం ద్వారా మీరు పోయినా మాకు పవన్ కల్యాణ్ రూపంలో ఒక మిత్రుడు ఉన్నాడని చెప్పడమే అసలు ఉద్దేశం అంటారు. ఇది ఓ రకంగా మంచి స్ట్రాటజీనే. పైగా పవన్ కల్యాణ్ వలన వైఎస్సార్ కాంగ్రెస్ కి నష్టం
చేకూరుతుందని  అందుకే  ఆయన చంద్రబాబుని( తెలంగాణలో కేసీఆర్‌ని) విమర్శించకుండా జగన్‌ని విమర్శిస్తున్నారని విశ్లేషకుల వాదన. ఐతే జనసేన మాత్రం తమది నిర్మాణాత్మక ప్రతిపక్షమని..నానా యాగీ చేయమని సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని చెప్పుకుంటోంది. దీని ద్వారా తమ పాత్ర ప్రతిపక్షానికే పరిమితమని ఓపెన్‌గానే అంగీకరించినట్లైంది..ఐతే ఇలాంటి దశలో చింతమనేని ఇలా పవన్ సాయం గురించి మాట్లాడటంతో ఈ రెండు పార్టీల పొత్తు గురించి ఏపీ జనానికి ఇంకో సంకేతం వెళ్లినట్లైంది. అంటే రేపొద్దున ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసినా..జనం మాత్రం ఒకటిగానే గుర్తిస్తారు. ఈ ప్రమాదాన్నిఊహించలేకో..లేక తన మనసులో ఇంకో వ్యూహంతోనో తెలీదు కానీ చింతమనేని అసలు నిజం బైటపెట్టేశాడు.

పనిలో పనిగా వైఎస్ జగన్ లక్ష కిలోమీటర్లునడిచినా ముఖ్యమంత్రి కాలేడంటూ రొటీన్ డైలాగ్ కూడా జత చేశాడు. ఐతే తన ప్రవర్తనతో చంద్రబాబుకి తెగ చీకాకు తెప్పించిన చింతమనేనికి దెందలూరులో ఈసారి టిక్కెట్ రాదనే ప్రచారం సాగుతోంది. అందుకే ముందస్తుగా ఓ బిస్కెట్ పడేస్తే భవిష్యత్తులో తన పోటీకి ఢోకా లేకుండా ఉంటుందనే దూరదృష్టితోనే ఇలా జనసేనపట్ల ప్రవాహభక్తి ప్రదర్శిస్తున్నాడని అంటున్నారు. 

Comments