ఆగమాగమై పోయి నాగం చివరికిలా!


నాగం జనార్ధనరెడ్డి ఈ పేరు జనం మర్చిపోయి చాలా రోజులే అయింది. తెలంగాణ కోసం పోట్లాడితే పోట్లాడండి..మేం మాత్రం రోడ్లమీదకు రాము..ఈ ఒక్క మాటతో ఓయూలో స్టూడెంట్స్‌కి పిచ్చెక్కించేసి చావు దెబ్బలు తిన్నాడు నాగం.. అసలు ఆ సన్నివేశాలు చూసిన క్షణంలో అసలు నాగం బతుకుతాడా..వదులుతారా అన్పించింది కూడా..ఐతే తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ఏదో పోషించి ఆ మచ్చ మాపుకున్నాడు. టిడిపినుంచి బైటికి వచ్చి తెలంగాణా నగారా అంటూ ఏదో పార్టీ పెట్టుకున్నాడు..చివరికి టిఆర్ఎస్‌తో కుదరక, అటు కాంగ్రెస్‌లో చేరలేక బిజెపిలో చేరిపోయాడు
ఐనా భారతీయ జనతాపార్టీలో కల్నల్ ఏకలింగంలా మారిపోయిన నాగం చూపు ఇప్పుడిక కాంగ్రెస్‌వైపే పడిందట. ఇంత బతుకూ బతికి చివరికి కాంగ్రెస్‌లో చేరడం అంటే కేవలం కులసమీకరణ కోణమనే కొంతమంది వాదన. ఓ జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎదగాల్సిన తరుణంలో వేసిన తప్పుటడుగులతోనే ప్రస్తుత దీనస్థితికి కారణమని కొందరు అంటారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు చంద్రబాబు తర్వాత ఎవరయ్యా ఆంటే గుర్తొచ్చేది దేవందర్ గౌడ, నాగం జనార్ధనరెడ్డి మాత్రమే..అలాంటిది చేజేతులారా తన భవిష్యత్తుని తానే నాశనం చేసుకుని ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి మరో తప్పు చేస్తున్నాడనే వాళ్లూ ఉన్నారు. ఐతే బలమైన ప్రత్యర్ధిని ఎదుర్కోవాలంటే తనకంటూ గుర్తింపు ఇచ్చే పార్టీ కావాలనేది నాగం ఆలోచనగా చెప్తున్నారు


Comments