అన్ని పార్లమెంట్ సీట్లను బిజెపికి వదిలేసి..అసెంబ్లీకి మాత్రం టిడిపి పోటీనా!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి మోడీతో కలసి వచ్చిన నాలుగు రోజులకు ఇంకా ఊహాగానాలు మీటుతూనే ఉన్నారు. అసలు అక్కడేం మాట్లాడుకున్నారనేది బైటికి చెప్పకపోయినా..చంద్రబాబుకు ఆ భేటీ ఏమాత్రం ఉపశమనం కలిగించలేదనేది ఆయన మాటల్లోనే తెలిసిపోయింది. హామీలు నిలబెట్టుకోకపోతే కోర్టుకు వెళ్తామని అనడం ఆ అంశాన్నే నిర్ధారిస్తుంది. ఇప్పుడు ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్లమెంట్ సీట్లను బిజెపికి వదిలేసి..అసెంబ్లీ సీట్లను మాత్రం టిడిపి పోటీ చేయాలట..!

ఇది వినడానికే విచిత్రంగా ఉంది కదా..కానీ ఇదే విషయం తెగ చర్చలు జరుగుతున్నాయ్. అసలు బిజెపికి ఆ రాష్ట్రంలో ఉన్న సత్తా ఏంటో అందరికీ తెలుసు..తెలుగుదేశానికి ఉన్న బలాన్ని వాడుకుని నాలుగు అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న బిజెపి ఉన్న ఎంపి సీట్లను అడగడం మామూలు కామెడీ కాదు అసలు ఇలాంటి పొత్తుని ఏ పార్టీ అంగీకరించదు..ఐనా ఇలాంటి ప్రపోజల్ (నిజంగా) పెట్టి ఉంటే..అది ఖచ్చితంగా టిడిపిని వదిలించుకోవడానికే అయి ఉంటుందనడంలో సందేహం లేదు. మరిప్పుడు అదే పని చేశారనుకోవాలా..

ఉత్త ప్రచారమే అయితే ఆ విషయం గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు..పోచికోళ్ల కబుర్లు చెప్పుకోవడానికి మాత్రం ఇలాంటి పుకార్లు బ్రహ్మాండంగా పనికి వస్తాయ్. మరిదే ప్రపోజల్ రేపొద్దున్న వైఎస్సార్ కాంగ్రెస్ ముందు పెడితే..సమస్యే లేదు జగన్‌కి ఎమ్మెల్యే సీట్లతో పాటు పార్లమెంట్ మెంబర్లకు ఉన్న ప్రాధాన్యతా తెలుసు..అవసరమైతే ఎన్నికల తర్వాత పొత్తులకు ఓకే అంటాడే కానీ..ముందు మాత్రం ఇలాంటి అలయన్స్‌ని చచ్చినా పట్టించుకోడు దానికి గత ఎన్నికలే నిదర్శనం. అందుకే ప్రస్తుతం ఈ ఎంపి సీట్ల ఛాయిస్ అంశం కాస్త టైమ్‌పాస్ వ్యవహారంగా మారింది

Comments